
తమిళనాట హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే సంబంధం ఎప్పడూ ప్రత్యేకంగానే ఉంటుంది. తమ అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ.. వారికి ఆతిథ్యమిస్తూ ఉంటారు హీరోలు. రజినీ ఏడాదికొకసారి అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమవుతుంటారు. ఇళయ దళపతి విజయ్ ఏటా మేడేన కొంతమంది కార్మికులకు భోజనాలు పెట్టిస్తుంటారు.
ఈ ఏడాది కూడా విజయ్ ఈ కార్యక్రమాన్ని మే ఒకటో తేదీన చేపట్టాలని అనుకున్నారట కానీ ఎన్నికలు జరగుతుండటంతో కుదరలేదని సమాచారం. అయితే ఎలక్షన్స్ ముగిసి ఎన్నికల కోడ్‌ను ఎత్తేసిన సందర్భంలో.. విజయ్ అధికారిక బృంధం ఆటోడ్రైవర్స్‌కు భోజనాలు పెట్టించి, బహుమతులు అందజేసింది. ప్రస్తుతం విజయ్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతోన్న మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment