ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప మూవీ భారీ హిట్ అవడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. అయితే గతంలో బన్నీ బాలీవుడ్ సినిమాలో నటించనున్నారని అప్పట్లో ఓ వార్త తెగ వైరలైంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మూవీ జవాన్‌లో ప్రత్యేక పాత్రలో బన్నీ నటిస్తారని అందరూ భావించారు. అల్లు అర్జున్ నటిస్తే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ అభిమానులకు దగ్గర కావొచ్చని అట్లీ ప్లాన్ చేశారు.
కానీ తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా బన్నీ జవాన్‌లో నటించేందుకు ఒప్పుకోలేదని ఓ వార్త వైరలవుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. పుష్ప-2 షూటింగ్ బిజీ షెడ్యూల్ వల్లే జవాన్‌లో అతిథి పాత్రకు నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ పూర్తిస్థాయిలో పుష్ప-2 పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment