హైదరాబాద్: పద్మారావునగర్‌లోని ఇంటిపై కన్నేసి, దాన్ని కాజేయడం కోసం యజమాని అయిన సినీ నిర్మాత అంజిరెడ్డిని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేసి అరెస్టైన రాజేష్ గణేష్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు 2019లో డబ్బు కోసమే తన ప్రేయసి మౌనికను హత్య చేసి కటకటాల్లోకి చేరాడు. నార్త్‌జోన్‌లో ఉన్న తుకారాంగేట్ ఠాణా పరిధిలో నమోదైన ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. శనివారం డీసీపీ చందన దీప్తిని కలిసిన హతురాలి కుటుంబీకులు ఆ కేసు విచారణ త్వరగా ముగిసేలా చూడాలని, రాజేష్ నుంచి తమకు రక్షణ కలి్పంచాలని విజ్ఞప్తి చేశారు.
చెన్నై నుంచి వచ్చి అక్వేరియం దుకాణం ఏర్పాటు...
రాజేష్ కుటుంబం కొన్నేళ్ల క్రితం చెన్నై నుంచి నగరానికి వలస వచ్చింది. గతంలో పార్శిగుట్ట శ్రీనివాసకాలనీలో నివసించింది. ఈ ప్రాంతంలోనే రాజేష్ అక్వేరియం దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతడికి 2014లో మహేంద్రహిల్స్‌లోని బాలమ్రాయ్ సొసైటీకి చెందిన ఆదిమూలం మౌనికతో పరిచయం ఏర్పడింది. ఈమెకు తండ్రి లేదని, తల్లి, సోదరి మాత్రమే ఉన్నారని తెలుసుకున్న రాజేష్ ప్రేమ పేరుతో దగ్గర కావడంతో పాటు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. మౌనిక ఇంటికి వెళ్తూ ఆమె కుటుంబీకులకు దగ్గరయ్యాడు. తర్వాత తన వ్యాపార విస్తరణకు సహాయం చేయాలంటూ మౌనిక తల్లి పుష్పను కోరాడు. తన చిన్న కుమార్తె కాబోయే భర్త అనే ఉద్దేశంతో సహాయం చేయడానికి అంగీకరించిన ఆమె తన పెద్ద కుమార్తె వివాహం సమయానికి తిరిగి ఇవ్వాలంటూ షరతు విధించారు. దీనికి రాజేష్ అంగీకరించడంతో దఫదఫాలుగా రూ.15 లక్షలు రాజేష్‌కు అందించింది.
ఆ డబ్బు తిరిగి ఇవ్వమనడంతో కక్షకట్టాడు...
పుష్ప పెద్ద కుమార్తెకు 2019లో వివాహం నిశ్చయమైంది. దీంతో తమ నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా పుష్ప తన కుమార్తె మౌనిక ద్వారా రాజేష్‌ను అడిగింది. ఈ విషయంపై మౌనిక–రాజేష్ మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. దీంతో ఆమెను హతమార్చాలని రాజేష్ పథకం వేశాడు. 2019 మే 8న మౌనికకు ఫోన్ చేసిన ఇతగాడు ఆమె తల్లి పని నిమిత్తం, సోదరి ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్తున్నారని తెలుసుకున్నాడు. దీంతో తాను లంచ్ కోసం వస్తున్నానని చెప్పాడు. అలా వచి్చన రాజేష్ కు మౌనికకు మధ్య ఘర్షణ జరిగింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అతడు ఆమె తలపై దాడి చేసి చంపేశాడు.
దీనిపై పుష్ప ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న తుకారాంగేట్ పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఆ రోజు మౌనిక ఇంటికి వెళ్లి భోజనం చేసి కొద్దిసేపు ఉండి వచ్చేశానంటూ చెప్పిన రాజేష్ తన ప్రమేయం లేదంటూ తప్పించుకోవాలని చూశాడు. పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి సందేహాలు లేవని, హత్య అనడానికి ఆధారాలు కూడా లేవంటూ రాజే‹Ùను అరెస్టు చేయకుండా వదిలేశారు. మౌనిక చనిపోయిన బాధ కూడా లేని అతగాడు ఆ వెంటనే మాట్రిమోనియల్ సైట్లలో పెళ్లి కుమార్తె కావాలంటూ యాడ్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ చూసిన మౌనిక కుటుంబీకులకు అప్పటి వరకు అతడిపై ఉన్న అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఆధారాల కోసం అన్వేíÙంచడం ప్రారంభించారు.
మూడు రోజులకు దొరికిన ఆధారం...
ఈ కేసులో ఆధారాల కోసం పోలీసులకు పోటీగా మౌనిక కుటుంబీకులు ప్రయత్నాలు చేశారు. పుష్ప ఇంటికి కొద్ది దూరంలో ఉన్న సీసీ కెమెరా వీరికి కీలక ఆధారం అందించింది. హత్య జరిగిన రోజు సాయంత్రం 4 గంటలకే తాను మౌనిక వద్ద నుంచి వెళ్లిపోయానని రాజేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.30 వరకు రాజేష్ అక్కడే ఉన్నట్లు తేలింది. దీంతో పాటు ఇతర ఆధారాలను పోలీసులకు అందించారు. ఫోరెన్సిక్ రిపోర్టు సైతం మౌనిక తలపై ఆరు అంగుళాల బలమైన గాయం ఉందని, ఇది హత్యేనని తేలి్చంది. వీటి ఆధారంగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి రాజేష్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతగాడు బెయిల్‌పై బయటకు రాగా...ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది.
రాజేష్కు శిక్షపడేలా చూడాలంటూ...
తాజాగా నిర్మాత అంజిరెడ్డి కేసులో రాజేష్ అరెస్టు అయిన విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబీకులు శనివారం నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తిని కలిశారు. మౌనికను చంపిన రాజేష్ కు వీలైనంత త్వరలో శిక్షపడేలా చూడాలని, అతడి నుంచి తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఓ హత్య కేసులో బెయిల్‌పై బయటకు తిరుగుతూ మరో క్రూరమైన హత్య చేసిన రాజేష్ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
ఇతడి వ్యవహారాలను పూర్తి స్థాయిలో ఆరా తీస్తామని, కోర్టుకు నివేదించడం ద్వారా కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హతురాలి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. అంజిరెడ్డి హత్య కేసులో జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించిన రాజేష్ తో పాటు సుపారీ హంతకులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని గోపాలపురం పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment