Anji Reddy
-
ప్రేయసినీ చంపేశాడు!
హైదరాబాద్: పద్మారావునగర్‌లోని ఇంటిపై కన్నేసి, దాన్ని కాజేయడం కోసం యజమాని అయిన సినీ నిర్మాత అంజిరెడ్డిని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేసి అరెస్టైన రాజేష్ గణేష్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు 2019లో డబ్బు కోసమే తన ప్రేయసి మౌనికను హత్య చేసి కటకటాల్లోకి చేరాడు. నార్త్‌జోన్‌లో ఉన్న తుకారాంగేట్ ఠాణా పరిధిలో నమోదైన ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. శనివారం డీసీపీ చందన దీప్తిని కలిసిన హతురాలి కుటుంబీకులు ఆ కేసు విచారణ త్వరగా ముగిసేలా చూడాలని, రాజేష్ నుంచి తమకు రక్షణ కలి్పంచాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై నుంచి వచ్చి అక్వేరియం దుకాణం ఏర్పాటు... రాజేష్ కుటుంబం కొన్నేళ్ల క్రితం చెన్నై నుంచి నగరానికి వలస వచ్చింది. గతంలో పార్శిగుట్ట శ్రీనివాసకాలనీలో నివసించింది. ఈ ప్రాంతంలోనే రాజేష్ అక్వేరియం దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతడికి 2014లో మహేంద్రహిల్స్‌లోని బాలమ్రాయ్ సొసైటీకి చెందిన ఆదిమూలం మౌనికతో పరిచయం ఏర్పడింది. ఈమెకు తండ్రి లేదని, తల్లి, సోదరి మాత్రమే ఉన్నారని తెలుసుకున్న రాజేష్ ప్రేమ పేరుతో దగ్గర కావడంతో పాటు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. మౌనిక ఇంటికి వెళ్తూ ఆమె కుటుంబీకులకు దగ్గరయ్యాడు. తర్వాత తన వ్యాపార విస్తరణకు సహాయం చేయాలంటూ మౌనిక తల్లి పుష్పను కోరాడు. తన చిన్న కుమార్తె కాబోయే భర్త అనే ఉద్దేశంతో సహాయం చేయడానికి అంగీకరించిన ఆమె తన పెద్ద కుమార్తె వివాహం సమయానికి తిరిగి ఇవ్వాలంటూ షరతు విధించారు. దీనికి రాజేష్ అంగీకరించడంతో దఫదఫాలుగా రూ.15 లక్షలు రాజేష్‌కు అందించింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వమనడంతో కక్షకట్టాడు... పుష్ప పెద్ద కుమార్తెకు 2019లో వివాహం నిశ్చయమైంది. దీంతో తమ నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా పుష్ప తన కుమార్తె మౌనిక ద్వారా రాజేష్‌ను అడిగింది. ఈ విషయంపై మౌనిక–రాజేష్ మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. దీంతో ఆమెను హతమార్చాలని రాజేష్ పథకం వేశాడు. 2019 మే 8న మౌనికకు ఫోన్ చేసిన ఇతగాడు ఆమె తల్లి పని నిమిత్తం, సోదరి ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్తున్నారని తెలుసుకున్నాడు. దీంతో తాను లంచ్ కోసం వస్తున్నానని చెప్పాడు. అలా వచి్చన రాజేష్ కు మౌనికకు మధ్య ఘర్షణ జరిగింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అతడు ఆమె తలపై దాడి చేసి చంపేశాడు. దీనిపై పుష్ప ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న తుకారాంగేట్ పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఆ రోజు మౌనిక ఇంటికి వెళ్లి భోజనం చేసి కొద్దిసేపు ఉండి వచ్చేశానంటూ చెప్పిన రాజేష్ తన ప్రమేయం లేదంటూ తప్పించుకోవాలని చూశాడు. పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి సందేహాలు లేవని, హత్య అనడానికి ఆధారాలు కూడా లేవంటూ రాజే‹Ùను అరెస్టు చేయకుండా వదిలేశారు. మౌనిక చనిపోయిన బాధ కూడా లేని అతగాడు ఆ వెంటనే మాట్రిమోనియల్ సైట్లలో పెళ్లి కుమార్తె కావాలంటూ యాడ్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ చూసిన మౌనిక కుటుంబీకులకు అప్పటి వరకు అతడిపై ఉన్న అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఆధారాల కోసం అన్వేíÙంచడం ప్రారంభించారు. మూడు రోజులకు దొరికిన ఆధారం... ఈ కేసులో ఆధారాల కోసం పోలీసులకు పోటీగా మౌనిక కుటుంబీకులు ప్రయత్నాలు చేశారు. పుష్ప ఇంటికి కొద్ది దూరంలో ఉన్న సీసీ కెమెరా వీరికి కీలక ఆధారం అందించింది. హత్య జరిగిన రోజు సాయంత్రం 4 గంటలకే తాను మౌనిక వద్ద నుంచి వెళ్లిపోయానని రాజేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.30 వరకు రాజేష్ అక్కడే ఉన్నట్లు తేలింది. దీంతో పాటు ఇతర ఆధారాలను పోలీసులకు అందించారు. ఫోరెన్సిక్ రిపోర్టు సైతం మౌనిక తలపై ఆరు అంగుళాల బలమైన గాయం ఉందని, ఇది హత్యేనని తేలి్చంది. వీటి ఆధారంగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి రాజేష్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతగాడు బెయిల్‌పై బయటకు రాగా...ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. రాజేష్‌కు శిక్షపడేలా చూడాలంటూ... తాజాగా నిర్మాత అంజిరెడ్డి కేసులో రాజేష్ అరెస్టు అయిన విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబీకులు శనివారం నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తిని కలిశారు. మౌనికను చంపిన రాజేష్ కు వీలైనంత త్వరలో శిక్షపడేలా చూడాలని, అతడి నుంచి తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఓ హత్య కేసులో బెయిల్‌పై బయటకు తిరుగుతూ మరో క్రూరమైన హత్య చేసిన రాజేష్ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇతడి వ్యవహారాలను పూర్తి స్థాయిలో ఆరా తీస్తామని, కోర్టుకు నివేదించడం ద్వారా కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హతురాలి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. అంజిరెడ్డి హత్య కేసులో జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించిన రాజేష్ తో పాటు సుపారీ హంతకులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని గోపాలపురం పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
నిర్మాత అంజిరెడ్డి కేసులో వెలుగులోకి సంచలనాలు
హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలు చేస్తామని చెప్పి నమ్మించి ఎన్నారై, సినీ నిర్మాత అంజిరెడ్డిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజేష్ మొదటి నుంచి పథకం ప్రకారమే కథ అంతా నడిపించాడు. ఇల్లు కొనుగోలు చేస్తానని నమ్మించి..డబ్బు చెల్లించకుండానే ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఆయనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నా పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్, ఆయన డ్రైవర్, ఇద్దరు బిహారీ పనిమనుషులు మొత్తం ఆరుగురి ప్రమేయం బయటపడగా మరికొంత మంది కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది? గత నెల 29వ తేదీ సాయంత్రం 5.31 నిమిషాలకు సికింద్రాబాద్ ఎస్.డి రోడ్డులోని డి–మార్ట్ భవనంలో బేస్మెంట్–3కు నిందితుడు రాజేష్ ఒక కారులో రాగా ఆయనతో పాటు అంజిరెడ్డి తన వ్యాగన్ ఆర్ కారులో వచ్చారు. ఇదే భవనంలోని మొదటి అంతస్తులో జీఆర్ కన్వెన్షన్ ఉండగా దీనికి సంబంధించిన కారు పార్కింగ్ బేస్మెంట్–3లో కొనసాగుతుంది. ఈ కన్వెన్షన్‌లో ఫంక్షన్లు అయినపుడు మాత్రమే కార్లు పార్కింగ్ చేసి ఉంటాయి. లేకుంటే పార్కింగ్ ప్రదేశం మొత్తం ఖాళీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంజిరెడ్డిని బెదిరించి సంతకాలు చేయించుకుని అంతమొందించేందుకు మంచి ప్రదేశమని పథకం వేశారు. 5.31 నిమిషాలకు కార్లు బేస్మెంట్–3 లోపలికి వెళ్లగా దాదాపు రాత్రి 8.45 ప్రాంతంలో అంజిరెడ్డికి ప్రమాదం జరిగిందని కుమారుడు చరణ్‌కు సమాచారం వచి్చంది. దీంతో 9.15 నిమిషాలకు పోలీసులు ఈ భవనంలోని బేస్మెంట్–3కి చేరుకున్నారు. అయితే ముందుగానే సిద్ధం చేసుకున్న రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ల డ్రాప్టును ఆయన ముందుంచి సంతకాలు తీసుకునేందుకు తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో కర్రతో ఆయనను తీవ్రంగా గాయపరచడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అంజిరెడ్డి కారు ప్రమాదానికి గురై మరణించినట్లు చిత్రీకరించేందుకు ఆయన వ్యాగన్ ఆర్ కారును భవనం పిల్లర్లకు గుద్ది ప్రమాదంగా నమ్మించారు. మృతదేహాన్ని కారు పక్కన పడేసి ఏమి తెలియనట్లు ఉన్నారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి..మృతదేహాన్ని అక్కడ నుంచి తొలగించాక...రాజేష్ కారులో నిందితులు బేస్మెంట్–3 నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మూడు కార్లలో వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. సాయంత్రం 5.31 నిమిషాల నుంచి 9.15 నిమిషాల వరకు మధ్యలో ఏమి జరిగిందనేది ఇంకా కొంత సస్పెన్షన్ కొనసాగుతోంది. హత్యకు గురైన అంజిరెడ్డి గతంలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. 1993లో దొంగ అల్లుడు, చెలికాడు తదితర చిత్రాలు నిరి్మంచగా...గత కొద్ది రోజుల నుంచి ఆయన సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. -
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్‌లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్‌లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్‌కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్‌కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
2024 ఎన్నికల్లో జగనే సీఎం.. ఇది పక్కా
ఒంగోలు: ప్రచార పిచ్చితో చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని, ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొస్తే దానిని టీడీపీ, జనసేన, సీపీఐలు విమర్శించడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించి కందుకూరులో 8 మంది ప్రాణాలు, చీరెలు ఇస్తామంటూ అమాయక పేద ప్రజలను ఆశపెట్టిన కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇటువంటి మరణాలు పునరావృతం కారాదని, పేదల హృదయ వేదన అర్థం చేసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవో నంబర్ ఒకటి తీసుకొచ్చారన్నారు. అది అర్థం చేసుకోకుండా పేదల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు... తమ మీటింగ్‌లు మాత్రం యధాతథంగా జరగాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి చర్యలను ప్రజలు హర్షించరన్నారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సీపీఐ, జనసేన, టీడీపీ మూడు కలిసి పనిచేసినా 2024 ఎన్నికల్లో జగన్‌ను సీఎం కాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. తనకు శ్రీవెంకటేశ్వర పొలిటికల్ సర్వే సంస్థ ఉందని, ఎన్ని విధాలుగా సర్వేచేసినా ప్రజలు మాత్రం జగన్ వైపు ఉన్నారని, కేవలం ప్రచార ఆర్భాటం ద్వారా టీడీపీ మైలేజీ పెంచుకోవాలని చూస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కూడా వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని, ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని పాతిక వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కనీసం ప్రతిపక్ష పార్టీ నేత అందుబాటులో లేకపోవడం, ఒక వేళ వస్తే పేదలను ఆదుకోవడానికి డబ్బు వెచ్చించాల్సి వస్తుందంటూ హైదరాబాదు, బెంగళూరులో దాక్కున్నారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు ఏదోలా జనాలను నమ్మించి టికెట్లు అంటగట్టాలని ఆరాట పడుతున్నారని, టీడీపీ నాయకులు పోటీ చేసి ఉన్నదంతా పోగొట్టుకుని తరువాత బాధపడేకంటే ముందుగానే ఆలోచించుకోవడం మంచిదని సూచించారు. ఇటీవల చంద్రబాబు పెట్టిన రెండు రకాల బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలు కూడా ప్రజల్లో ఆయనకు వ్యతిరేకత పెంచేవిగానే ఉన్నాయన్నారు. మిణుగురు పురుగుల్లా చంద్రబాబు వద్దకు చేరవద్దని, దగ్గరకు వెళితే కాలిపోయేది మీరే అని గుర్తుంచుకోవాలని అన్నారు. మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షేక్ మీరావలి మాట్లాడుతూ బాలినేనిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దామచర్ల జనార్దన్ మానుకోవాలని హితవు పలికారు. -
జీవన ‘సాగరాలవి’.. ఆ ఆలోచన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలు హైదరాబాద్ నగరానికి ‘జీవనరేఖ (లైఫ్‌లైన్)’గా ఉన్నాయని, వాటి పరిరక్షణ అత్యంత కీలకమని జేఎన్టీయూ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ఎన్విరాన్మెంటల్ కమిటీ మాజీ చైర్మన్ ఎం.అంజిరెడ్డి పేర్కొన్నారు. జలాశయాలకు ఏమాత్రం నష్టం జరగకుండా ఉం డేలా సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో జీవో 111కు సవరణలు చేయవచ్చని సూచించారు. అంతేతప్ప జలాశయాలతో ఉపయోగం లేదనడం, ఎత్తేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. కొన్ని దశాబ్దాల కిందటి వరకు మంచినీటి వనరుగా ఉన్న హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంగా మారిపోయిందని, భవిష్యత్‌లో జంట జలాశయాలకు ఆ దుస్థితి రాకుండా చూడాలని చెప్పారు. రిజర్వాయర్లను మాత్రమేకాకుండా, వాటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పర్యావరణ చట్టాలు, కేంద్ర నిబంధనల మేరకు పరిరక్షించాల్సి ఉందన్నారు. జీవో 111, జంట జలాశయాల అంశాలపై అంజిరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఇందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సుస్థిర అభివృద్ధి చర్యలు చేపట్టాలి జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.34 లక్షల ఎకరాలకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, ఎగువ నుంచి వచ్చే జలాలు, డ్రైనేజీ వ్యవస్థలు, చెరువుల నెట్వర్క్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. చెరువులు, పర్యావరణ వ్యవస్థలకు నష్టం జరగకుండా చూడాలి. జలాశయాలకు నష్టం కలిగిస్తూ ఇక్కడి భూమిని అభివృద్ధి చేయాలని ఎక్కడా లేదు. టెక్నికల్ కమిటీ క్షుణ్నంగా పరిశీలించాలి 111 జీవో పరిధిలోని గ్రామాల రైతులకు నష్టం జరగకుండా ‘సాంకేతిక నిపుణుల కమిటీ’ప్రతి ఊరిలో భూమిని పరిశీలించాలి. వాగుల నెట్వర్క్ ఎలా ఉంది, అక్కడి నీరు ఎక్కడికి వెళుతుందనేది చూడాలి. ఆ ప్రకారం ఏయే ఏరియాలు, ఏయే సర్వే నంబర్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగలమో, జీవో 111కు ఏమేర సడలింపులు ఇవ్వాలో నిర్ణయిస్తే.. జంట జలాశయాలకు నష్టం వాటిల్లదు. దీనికి సంబంధించి చాలా కచ్చితంగా 1.34 లక్షల ఎకరాలను పరిశీలించాలి. ఫామ్‌హౌజ్‌లకు వీలుగా చట్టాలు చేయొచ్చు జీవో 111ను ఎత్తేయకుండా.. దీని పరిధిలో ఫామ్‌హౌజ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు చట్టమే చేయొచ్చు. ఉదాహరణకు పదెకరాల స్థలముంటే.. అందులో 20 శాతం దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవచ్చనే మార్గదర్శకాలు నిర్దేశించవచ్చు. ఆ నిర్మాణాల నుంచి వృధా జలాలు బయటికి రాకుండా.. శుద్ధి చేయడం, ఇతర అవసరాలకు వినియోగించడంపై నిబంధనలు పెట్టవచ్చు. దిగువ ప్రాంతాల్లో అనుమతులిచ్చాం! 111 జీవోకు సంబంధించి 2007–13 మధ్య నేను చైర్మన్‌గా ఉన్న ఏపీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఎన్విరాన్మెంటల్ కమిటీ).. జంట జలాశయాలకు నష్టం కలిగించని దిగువ ప్రాంతం (డౌన్ స్ట్రీమ్స్)లో అనుమతులిచ్చింది. అయితే 20వేల చదరపు మీటర్లు దాటే నిర్మాణాలకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఉంటేనే అనుమతులిచ్చే విషయాన్ని కచ్చితంగా పాటించాం. ఘన, ద్రవ వ్యర్థాల నివారణ చర్యలు చేపట్టేలా చూశాం. దీనికి సంబంధించి ప్రతీ ఫైల్ తప్పకుండా మున్సిపల్ శాఖ ఆమోదం పొందాకే మా దగ్గరకు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి సహజ రక్షణ ఎక్కడా లేదు ‘‘హైదరాబాద్ వంటి వినూత్న లక్షణాలు, భౌగోళిక పరిస్థితులు, సహజ రక్షణ ఉన్న నగరం మరొకటి లేదు. కొండలు, గుట్టలు, ఇతర సహజ లక్షణాలతో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలతో కూడిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు.. హైదరాబాద్ నగరానికి ‘జీవనరేఖ’ (లైఫ్‌లైన్)గా ఉపయోగపడుతున్నందున వాటి సంరక్షణ కీలకంగా మారింది. వీటి పరిధిలో పర్యావరణ వ్యవస్థలను, బయో కన్జర్వేషన్ జోన్లను కాపాడాలి. -
డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్: అంజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపు తర్వాత గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలకు చెక్ పెడుతున్నామని ఎక్సైజ్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ సూపరిండెంట్ అంజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 54 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారు హైదరాబాద్‌కు చెందిన పరంజ్యోతి, అమిత్ సింగ్‌లుగా ఆయన పేర్కొన్నారు. నిందితులను విచారించగా బెంగుళూరు నుంచి 70 గ్రాముల కొకైన్‌ను కోనుగోలు చేసి 16 గ్రాములు విక్రయించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ప్రస్తుతం ఎవరెవరికి కొకైన్‌ను విక్రయించారనే దానిపై విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వారి కాల్ డేటా, వాట్సప్ చాట్లను పరీశిలించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గంజాయి తరలించిన ముఠాను సైతం అరెస్టు చేశామని తెలిపారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ కృషి చేస్తుందన్నారు. కాగా పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ఆయన సూచించారు. -
బాబు ఇంటి ముందు తమ్ముళ్ల తన్నులాట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా మాచర్ల సీటు విషయంలో సీఎం చంద్రబాబు ఇరువర్గాల నేతలను పిలిపించి మాట్లాడారు. ఈ సమావేశానికి ఎంపీ రాయపాటి సాంబశివరావు, చలమారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అంజిరెడ్డిని గెలిపించాలని చలమారెడ్డికి, పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. సమావేశం అనంతరం అంజిరెడ్డి, చలమారెడ్డికి లక్ష్మారెడ్డి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. నువ్వు నాకు చెప్పేదేంటని ఆగ్రహంతో లక్ష్మారెడ్డిపై చలమారెడ్డి చేయి చేసుకున్నారు. ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు చలమారెడ్డి అనుచరులు అంజిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సీఎం నివాసంలోకి చొచ్చకెళ్లే ప్రయత్నం చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. అంజిరెడ్డికి సీటు కేటాయించడంతో చలమారెడ్డి అనుచరులు గత రెండు రోజులు ఆందోళన చేస్తున్నారు. ‘అంజిరెడ్డి వద్దు చలమారెడ్డి ముద్దు’ అంటూ నినదిస్తున్నారు. అంజిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ చలమారెడ్డి మండిపడుతున్నారు. -
చంద్రబాబు ఇంటి వద్ద కార్యకర్తల రచ్చరచ్చ..!
సాక్షి, అమరావతి : టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసిపోయి, నామినేషన్ల ప్రక్రియా మొదలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తగ్గడం లేదు. అసమ్మతి నేతల అనుయాయులు, పార్టీ కార్యకర్తలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు పోరాడైనా తమకు నచ్చని అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని పట్టుదలగా ఉన్నారు. మాచర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అన్నపురెడ్డి అంజిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నిరసనకు దిగింది. సీఎం చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు బుధవారం రెండోరోజు ఆందోళనకు దిగాయి. అంజిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు హెచ్చరించారు. తమ నిరసనలను లెక్కచేయకుండా ఆయన నామినేషన్ వేస్తే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన కొమ్మారెడ్డి చలమారెడ్డినే సీటు వరిస్తుందని అందరూ భావించగా.. అంజిరెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. -
‘రూ.400 కోట్లు బాకీ అంటూ కాకి లెక్కలు’
సాక్షి, విజయవాడ : టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఏపీలో పేదవాడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే.. ప్రభుత్వం ఇప్పటి వరకు 1252 కోట్ల రూపాయలు బకాయి పడిందని అన్నారు. అయినప్పటికీ కేవలం రూ. 400 కోట్లు మాత్రమే బాకీ ఉన్నామంటూ కాకి లెక్కలు చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలలో ప్రభుత్వ కనుసన్నల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. స్వర్ణయుగం మళ్లీ వస్తుంది దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కులమతాలకు అతీతంగా ప్రతీ పేద విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించేలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టారని అంజిరెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ యువత జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. విద్యా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి యువత, విద్యార్థులు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే విద్యార్థులతో సహా అన్ని వర్గాల కష్టాలు తీరతాయని, మరలా వైఎస్సార్ స్వర్ణయుగం వస్తుందని ఆకాంక్షించారు. -
‘చంద్రబాబు నిరుద్యోగులపై దాడులు చేయించారు’
సాక్షి, విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో మెగా డీఎస్సీ నిర్వహించి 50వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నిరుద్యోగులపై పోలీసులతో దాడులు చేయించారని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంజిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఏడాదికి ఒకసారి డీఎస్సీ అని ప్రకటించి నిరుద్యోగులని మోసం చేసిందన్నారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులని మోసగించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం 7 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు. యువనేస్తం పథకం అంతా బోగస్, షరతులు పెట్టి నిరుద్యోగులని నిలువునా మోసగిస్తున్నారని అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
‘ఆ రోజు త్వరలోనే వస్తుంది’
సాక్షి, విజయవాడ : నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన యువనేస్తం ఓ బోగస్ కార్యక్రమని అంజిరెడ్డి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే నోటిఫికేషన్ల పేరిట నిరుద్యోగులను మోసగిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అంజిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. -
పూలరంగడు కాంబినేషన్ లో మరో సినిమా
కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ ఒకటి రెండు సినిమా విజయాలు తప్ప హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి కమెడియన్ గా టర్న్ తీసుకొని రవితేజ, శ్రీనువైట్ల సినిమాతో పూర్తి స్థాయి కమెడియన్ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే హీరోగా మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. తనకు పూలరంగడు లాంటి హిట్ సినిమాను అందించిన వీరభద్రం దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సునీల్. ఈ సినిమా అంజి రెడ్డి ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
అంజిరెడ్డిని ఆదుకోలేరా?
తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యమకారుడు ♦ చికిత్స కోసం రూ.5 లక్షలకు పైగా అప్పులు ♦ సీఎం కేసీఆర్ ఆదేశించినా అందని సాయం ♦ ప్రత్యేక జీవో లేదంటూ దాటవేస్తున్న అధికారులు సాక్షి నల్లగొండ: ధూంధాంలతో ప్రత్యేక తెలం‘గానం’ వినిపిస్తూ.. ఊరూరా ప్రజలను చైతన్య పరుస్తూ కళా కారులు ముందుకు సాగుతున్న రోజులవి. 2010 ఫిబ్రవరి 3న నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియా గ్రామంలో గాయని మధుప్రియ ఆధ్వర్యంలో ధూంధాం రసవత్తరంగా సాగుతోంది. అప్పటికే ఉద్యమంలో ఉత్సా హంగా పాల్గొంటున్న స్థానికులకు ఆ ధూంధాం మరింత ఆవేశాన్ని, ఆగ్రహజ్వాలను రగిల్చింది. ఇంతలో అక్కడ అలజడి మొదలైంది. చందా అంజిరెడ్డి అనే యువకుడు తీవ్ర ఆవేశంతో.. తెలంగాణ రాదేమోనన్న భయంతో ఒక్క సారిగా జై తెలంగాణ నినాదం చేస్తూ స్టేజీ పైకి దూసు కొచ్చాడు. చేతిలో ఉన్న కత్తితో గొంతు, పొట్టలో పొడుచు కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అంజిరెడ్డిని నాగార్జున సాగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆదిత్య కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి తెలంగాణ డాక్టర్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు, ఇప్పటి భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అతడికి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. నెల రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు. ఈ సమయంలో కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, నిజామా బాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జేఏసీ చైర్మన్ కోదండరాం పలువురు ఉన్నారు. ఇతను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేసరికి రూ.5 లక్షలకు పైగా ఖర్చయింది. పేద, మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన అంజిరెడ్డి తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కొడుకు ప్రాణాలు కాపాడగలిగారు. ఇంతలోనే తెలంగాణ రావ డం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవడంతో వారిలో కొత్తగా ఆశలు చిగురించాయి. తెలంగాణ ప్రభుత్వం ఏ విధం గానైనా ఆదుకోకపోతుందా అనే ఆశతోనే అంజిరెడ్డి సహాయం కోసం కలవని మంత్రి లేడు.. ప్రజాప్రతినిధి లేడు. విసుగు చెందిన అంజిరెడ్డి చివరి ప్రయత్నంగా సీఎల్పీ నేత జానారెడ్డిని కలసి తన గోడు వెళ్లబోసు కున్నాడు. అంజిరెడ్డికి సాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేసీఆర్ ఉద్యోగ కల్పన, ఆర్థిక సాయం చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ చిరంజీవులును ఆదేశించారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. జిల్లాలు మారాయి.. కలెక్టర్లూ మారుతున్నారు. అయినా..అంజిరెడ్డి తలరాత మాత్రం మారడం లేదు. నేటికీ వడ్డీలు కడుతూ దుర్భర జీవితం గడుపుతున్న అంజిరెడ్డి.. ఏనాటికైనా ప్రభుత్వం తమను ఆదుకుం టుందనే చిన్ని ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నాడు. -
చిట్టీల పేరుతో రూ.50 లక్షలు కుచ్చుటోపీ
చిట్టీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.50 లక్షల వరకు టోకరా వేశాడు. బాధితులు శనివారం హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్ డివిజన్లోని పద్మావతికాలనీలో నివసించే అంజిరెడ్డి గత పదేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా చిట్టీ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు. శనివారం ఉదయం బాధితులు అంజిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను నిలదీసి గొడవపడ్డారు. తాను చిట్టీలలో నష్టపోయానని బుకాయించడంతో బాధితులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 25 మంది బాధితులకు రూ.50 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని ఈ మేరకు అంజిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా డబ్బుల కోసం అంజిరెడ్డి ఇంటికి వెళ్లిన బాధితులు అతనిపై దాడి చేయగా అంజిరెడ్డి వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో భారీ చోరీ
గుంటూరు నగరంలోని రాఘవ నగర్లో శనివారం ఉదయం బారీ చోరీ జరిగింది. రిటైర్డ్ టీచర్ అంజిరెడ్డి ఇంట్లో దొంగలు జొరబడి 60 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయం గమనించిన అంజిరెడ్డి రాఘవనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెదక్ బీజేపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి
-
బిజెపి రెబల్ అభ్యర్థిగా అంజిరెడ్డి నామినేషన్
హైదరాబాద్: పటాన్చెరు శాసనసభ నియోజకవర్గానికి బీజేపీ రెబల్ అభ్యర్ధిగా ఎస్ఆర్ ట్రస్టు ఛైర్మన్ సి.అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పొత్తులో పటాన్చెరు స్థానం టీడీపీకి కేటాయించారు. దాంతో అంజిరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంజిరెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి జనవరిలోనే భారతీయ జనతాపార్టీలో చేరారు. -
‘చెరుకు’ను ప్రోత్సహించాలి
కామారెడ్డి, న్యూస్‌లైన్ : చెరుకు సాగును ప్రభుత్వం ప్రోత్సహిం చాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అంజిరెడ్డి డిమాండ్ చేశారు. టన్నుకు 3,500 మద్దతు ధర ఇవ్వాలని కోరారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో చెరుకు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రైతుల మధ్య ఐక్యత రాకుండా చూస్తున్నాయని, పార్టీలుగా చీల్చి లబ్ధిపొందుతున్నాయని పేర్కొన్నారు. రైతులను దగా చేస్తున్నాయి విదేశాల నుంచి చక్కెర దిగుమతికి తలుపులు తెరిచిన ప్రభుత్వాలు చెరుకు రైతును దగా చేస్తున్నాయని కె.సాయిరెడ్డి ఆరోపించారు. విదేశాల నుంచి వచ్చే చక్కెరపై 50 శాతం వరకు పన్ను వేసే వీలున్నా, 15 శాతం మాత్రమే వేయడంతో దేశంలో చక్కెర ధరలు పడిపోతున్నాయన్నారు. దీంతో ఫ్యాక్టరీలు చెరుకు ధర పెంచడానికి ససేమిరా అంటున్నాయన్నారు. ప్రభుత్వా లు పన్నులు తీసుకోవడమే తప్ప రైతులకు చే సిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చక్కెర బస్తాపై * 92 చొప్పున పన్ను వసూలు చేస్తూ, చెరుకు రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కల్పించడం లేదన్నారు. వస్త్ర వ్యా పారులతో లాలూచీ పడిన ప్రభుత్వాధి నేతలు వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేశారని, చక్కెరపై ఉన్న వ్యాట్‌ను మాత్రం తగ్గించడం లేదని ఆరోపించారు. రైతుల విషయంలో పూర్తిగా మోసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇథనాల్‌తో మేలు... పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం వరకు కలిపే అవకాశం ఉన్నా మనదేశంలో కేవలం 5 శాతం మాత్రమే కలుపుతున్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఇథనాల్‌ను 20 శాతం కలిపితే ఏటా * 80వేల కోట్లు దేశానికి ఆదా అవుతాయ ని పేర్కొన్నారు. ఇథనాల్ ధర లీటర్‌కు * 36 ఉందని, దీంతో చక్కెర ఫ్యాక్టరీలు ఇథనాల్ తయారీకి ముందుకు రావడం లేదని అన్నారు. ఇథనాల్ ధర, పెట్రోల్‌లో కలిపే శాతం పెంచితే ఫ్యాక్టరీలు లాభపడతాయని, రైతులకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రై తులను సమీకరించి, పాలకులపై ఒత్తిడి తేవడానికి జనవరి 23వ తేదీన జాతీయ సెమినార్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే వేదిక ఖరారు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు అంజిరెడ్డి, కుమారస్వామి, నర్సింహారెడ్డి, గో పాల్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, జయసింహారెడ్డి, వీరారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. సదస్సులో తీర్మానాలు సదస్సులో పలు తీర్మానాలు చేశారు. చెరుకు ధర టన్నుకు * 3,500 చెల్లించాలి. పక్షం రోజు ల్లో రైతుకు డబ్బులు అందించాలి. చెరుకు నరకడం, తరలింపును ఫ్యాక్టరీ వాళ్లే నిర్వహించాలి. ఎన్డీఎస్ఎల్కు సంబంధించిన మిల్లులపై సభా సంఘం నివేదికను అమలు చేయాలి. సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారాన్ని నడిపించాలి. ఇథనాల్ ధర పెంచాలి. చక్కెరపై విధించిన వ్యాట్‌ను వెంటనే తొలగించాలి. లేనిపక్షంలో వ్యాట్ సొమ్మును రైతులకు చెల్లించాలి. రైతులు అడిగిన వెంటనే 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు ఇవ్వాలి.