సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపు తర్వాత గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలకు చెక్ పెడుతున్నామని ఎక్సైజ్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ సూపరిండెంట్ అంజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 54 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారు హైదరాబాద్‌కు చెందిన పరంజ్యోతి, అమిత్ సింగ్‌లుగా ఆయన పేర్కొన్నారు. నిందితులను విచారించగా బెంగుళూరు నుంచి 70 గ్రాముల కొకైన్‌ను కోనుగోలు చేసి 16 గ్రాములు విక్రయించినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
ప్రస్తుతం ఎవరెవరికి కొకైన్‌ను విక్రయించారనే దానిపై విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వారి కాల్ డేటా, వాట్సప్ చాట్‌లను పరీశిలించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గంజాయి తరలించిన ముఠాను సైతం అరెస్టు చేశామని తెలిపారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ కృషి చేస్తుందన్నారు. కాగా పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment