హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలు చేస్తామని చెప్పి నమ్మించి ఎన్నారై, సినీ నిర్మాత అంజిరెడ్డిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజేష్ మొదటి నుంచి పథకం ప్రకారమే కథ అంతా నడిపించాడు. ఇల్లు కొనుగోలు చేస్తానని నమ్మించి..డబ్బు చెల్లించకుండానే ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఆయనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నా పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్, ఆయన డ్రైవర్, ఇద్దరు బిహారీ పనిమనుషులు మొత్తం ఆరుగురి ప్రమేయం బయటపడగా మరికొంత మంది కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?
గత నెల 29వ తేదీ సాయంత్రం 5.31 నిమిషాలకు సికింద్రాబాద్ ఎస్.డి రోడ్డులోని డి–మార్ట్ భవనంలో బేస్‌మెంట్–3కు నిందితుడు రాజేష్ ఒక కారులో రాగా ఆయనతో పాటు అంజిరెడ్డి తన వ్యాగన్ ఆర్ కారులో వచ్చారు. ఇదే భవనంలోని మొదటి అంతస్తులో జీఆర్ కన్వెన్షన్ ఉండగా దీనికి సంబంధించిన కారు పార్కింగ్ బేస్‌మెంట్–3లో కొనసాగుతుంది. ఈ కన్వెన్షన్లో ఫంక్షన్లు అయినపుడు మాత్రమే కార్లు పార్కింగ్ చేసి ఉంటాయి. లేకుంటే పార్కింగ్ ప్రదేశం మొత్తం ఖాళీగా ఉంటుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని అంజిరెడ్డిని బెదిరించి సంతకాలు చేయించుకుని అంతమొందించేందుకు మంచి ప్రదేశమని పథకం వేశారు. 5.31 నిమిషాలకు కార్లు బేస్‌మెంట్–3 లోపలికి వెళ్లగా దాదాపు రాత్రి 8.45 ప్రాంతంలో అంజిరెడ్డికి ప్రమాదం జరిగిందని కుమారుడు చరణ్‌కు సమాచారం వచి్చంది. దీంతో 9.15 నిమిషాలకు పోలీసులు ఈ భవనంలోని బేస్‌మెంట్–3కి చేరుకున్నారు. అయితే ముందుగానే సిద్ధం చేసుకున్న రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ల డ్రాప్టును ఆయన ముందుంచి సంతకాలు తీసుకునేందుకు తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో కర్రతో ఆయనను తీవ్రంగా గాయపరచడంతో ప్రాణాలు కోల్పోయాడు.
ఆ తర్వాత అంజిరెడ్డి కారు ప్రమాదానికి గురై మరణించినట్లు చిత్రీకరించేందుకు ఆయన వ్యాగన్ ఆర్ కారును భవనం పిల్లర్లకు గుద్ది ప్రమాదంగా నమ్మించారు. మృతదేహాన్ని కారు పక్కన పడేసి ఏమి తెలియనట్లు ఉన్నారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి..మృతదేహాన్ని అక్కడ నుంచి తొలగించాక...రాజేష్ కారులో నిందితులు బేస్‌మెంట్–3 నుంచి బయటకు వెళ్లారు.
ఆ తర్వాత మూడు కార్లలో వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. సాయంత్రం 5.31 నిమిషాల నుంచి 9.15 నిమిషాల వరకు మధ్యలో ఏమి జరిగిందనేది ఇంకా కొంత సస్పెన్షన్ కొనసాగుతోంది. హత్యకు గురైన అంజిరెడ్డి గతంలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. 1993లో దొంగ అల్లుడు, చెలికాడు తదితర చిత్రాలు నిరి్మంచగా...గత కొద్ది రోజుల నుంచి ఆయన సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment