కామారెడ్డి, న్యూస్‌లైన్ :
చెరుకు సాగును ప్రభుత్వం ప్రోత్సహిం చాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అంజిరెడ్డి డిమాండ్ చేశారు. టన్నుకు 3,500 మద్దతు ధర ఇవ్వాలని కోరారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో చెరుకు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రైతుల మధ్య ఐక్యత రాకుండా చూస్తున్నాయని, పార్టీలుగా చీల్చి లబ్ధిపొందుతున్నాయని పేర్కొన్నారు.
రైతులను దగా చేస్తున్నాయి
విదేశాల నుంచి చక్కెర దిగుమతికి తలుపులు తెరిచిన ప్రభుత్వాలు చెరుకు రైతును దగా చేస్తున్నాయని కె.సాయిరెడ్డి ఆరోపించారు. విదేశాల నుంచి వచ్చే చక్కెరపై 50 శాతం వరకు పన్ను వేసే వీలున్నా, 15 శాతం మాత్రమే వేయడంతో దేశంలో చక్కెర ధరలు పడిపోతున్నాయన్నారు. దీంతో ఫ్యాక్టరీలు చెరుకు ధర పెంచడానికి ససేమిరా అంటున్నాయన్నారు. ప్రభుత్వా లు పన్నులు తీసుకోవడమే తప్ప రైతులకు చే సిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చక్కెర బస్తాపై * 92 చొప్పున పన్ను వసూలు చేస్తూ, చెరుకు రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కల్పించడం లేదన్నారు. వస్త్ర వ్యా పారులతో లాలూచీ పడిన ప్రభుత్వాధి నేతలు వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేశారని, చక్కెరపై ఉన్న వ్యాట్‌ను మాత్రం తగ్గించడం లేదని ఆరోపించారు. రైతుల విషయంలో పూర్తిగా మోసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇథనాల్‌తో మేలు...
పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం వరకు కలిపే అవకాశం ఉన్నా మనదేశంలో కేవలం 5 శాతం మాత్రమే కలుపుతున్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఇథనాల్‌ను 20 శాతం కలిపితే ఏటా * 80వేల కోట్లు దేశానికి ఆదా అవుతాయ ని పేర్కొన్నారు. ఇథనాల్ ధర లీటర్‌కు * 36 ఉందని, దీంతో చక్కెర ఫ్యాక్టరీలు ఇథనాల్ తయారీకి ముందుకు రావడం లేదని అన్నారు. ఇథనాల్ ధర, పెట్రోల్‌లో కలిపే శాతం పెంచితే ఫ్యాక్టరీలు లాభపడతాయని, రైతులకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రై తులను సమీకరించి, పాలకులపై ఒత్తిడి తేవడానికి జనవరి 23వ తేదీన జాతీయ సెమినార్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే వేదిక ఖరారు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు అంజిరెడ్డి, కుమారస్వామి, నర్సింహారెడ్డి, గో పాల్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, జయసింహారెడ్డి, వీరారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
సదస్సులో తీర్మానాలు
సదస్సులో పలు తీర్మానాలు చేశారు. చెరుకు ధర టన్నుకు * 3,500 చెల్లించాలి. పక్షం రోజు ల్లో రైతుకు డబ్బులు అందించాలి. చెరుకు నరకడం, తరలింపును ఫ్యాక్టరీ వాళ్లే నిర్వహించాలి. ఎన్‌డీఎస్‌ఎల్‌కు సంబంధించిన మిల్లులపై సభా సంఘం నివేదికను అమలు చేయాలి. సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారాన్ని నడిపించాలి. ఇథనాల్ ధర పెంచాలి. చక్కెరపై విధించిన వ్యాట్‌ను వెంటనే తొలగించాలి. లేనిపక్షంలో వ్యాట్ సొమ్మును రైతులకు చెల్లించాలి. రైతులు అడిగిన వెంటనే 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు ఇవ్వాలి.
‘చెరుకు’ను ప్రోత్సహించాలి
Published Fri, Nov 1 2013 4:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement