గుంటూరు నగరంలోని రాఘవ నగర్‌లో శనివారం ఉదయం బారీ చోరీ జరిగింది. రిటైర్డ్ టీచర్ అంజిరెడ్డి ఇంట్లో దొంగలు జొరబడి 60 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయం గమనించిన అంజిరెడ్డి రాఘవనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.