సాక్షి, విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో మెగా డీఎస్సీ నిర్వహించి 50వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం నిరుద్యోగులపై పోలీసులతో దాడులు చేయించారని వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంజిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఏడాదికి ఒకసారి డీఎస్సీ అని ప్రకటించి నిరుద్యోగులని మోసం చేసిందన్నారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులని మోసగించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం 7 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు.
యువనేస్తం పథకం అంతా బోగస్, షరతులు పెట్టి నిరుద్యోగులని నిలువునా మోసగిస్తున్నారని అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment