సినీ నిర్మాత గదిలో చోరీ | The filmmaker of theft in the room | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత గదిలో చోరీ

Published Thu, Dec 31 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

The filmmaker of theft in the room

బంజారాహిల్స్: తన గదిలోని రూ. 5 లక్షలు నగదు, ల్యాప్‌టాప్, ఖరీదైన వాచ్ ఓ ఆటో డ్రైవర్  ఎత్తుకెళ్లాడని సినీ నిర్మాత  ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీ సుల కథనం ప్రకారం... మల్లాపూర్‌లో నివసించే సినీ నిర్మాత హబీబుద్దీన్ మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హబ్సీగూడలో ఆటో ఎక్కి ఫిలించాంబర్ వద్ద దిగా రు. ఆటో చార్జీ రూ.500 ఇవ్వడానికి ఫిలిం చాం బర్‌లోని తన గది నంబర్ 206కు ఆ ఆటో డ్రైవర్‌ను తీసుకెళ్లారు. అప్పటి కే మద్యం మత్తులో ఉన్న హబీ బుద్దీన్ ఆటో డ్రైవర్‌కు రూ. 500 ఇచ్చిన వెంట నే నిద్రపోయారు.

బుధవా రం తెల్లవారుజామున లేచి చూసేసరికి సినిమా నిర్మా ణ ఖర్చుల కోసం జేబులో ఉంచుకున్న రూ. 5 లక్షల నగదుతో పాటు టేబుల్‌పై ఉంచిన రాడోవాచ్, ల్యాప్‌టాప్, ఖరీదైన సెల్‌ఫోన్ కనిపించలేదు. తాను పడుకున్న సమయంలో ఆటో డ్రైవర్ వీటిని ఎత్తుకెళ్లి ఉంటాడని హబీబుద్దీన్  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement