
నిర్మాత మేనల్లుడు రేప్ చేశాడు
ముంబై: బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై రేప్ కేసు నమోదైంది. నిందితుడిపై అతని భార్య కేసు పెట్టింది. కాగా పోలీసులు వారి పేర్లను వెల్లడించలేదు. నిందితుడు తన మేనమామకు చెందిన ప్రొడక్షన్ హౌస్కు ఇంచార్జిగా పనిచేస్తున్నాడు.
తన భర్త తన నగలన్నీ తీసుకున్నాడని, వాటిని వెనక్కు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక తనను వేధిస్తున్నాడని, తన అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడని ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెర్సోవా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేముందు ప్రాథమిక దర్యాప్తు చేస్తామని చెప్పారు.