
Producer Guneet Monga Gets Engaged With Sunny Kapoor: ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రణ్‌బీర్ కపూర్-అలియా భట్‌ల వివాహం. ఈ నెల 14న వీరు వివాహబంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తాజాగా ఆమె ఫ్యాషన్ వ్యాపారవేత్త సన్నీ కపూర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని గునీత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఢిల్లీలోని ఓ హెరిటేజ్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.
చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఈ పోస్ట్‌కు 'కొన్నిసార్లు తప్పుడు రైలు కూడా మిమ్మల్ని సరైన స్టేషన్‌కు తీసుకువెళ్తుంది. ఆ విధంగానే నా జీవిత ప్రయాణంలో నా సహచరుడు సన్నీ నాకు దొరికాడు. తన నిశ్చితార్థం రోజున అమ్మ కట్టుకున్న చీరను నేను ధరించడంతో అమ్మనాన్నల ఆశీర్వాదం పొందినట్లుగా అనిపిస్తుంది.' అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది 38 ఏళ్ల మహిళా నిర్మాత గునీత్ మోంగా. కాగా సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గునీత్.. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్' సిరీస్, 'షాహిద్', 'మసాన్', 'ది లంచ్ బాక్స్' సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యహరించింది.
అలాగే గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి విమర్శకు ప్రశంసలు పొందిన 'పాగ్లైట్'కు నిర్మాణంలో భాగం పంచుకుంది. 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా పనిచేసింది గునీత్. దీనికి 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా అకాడమీ అవార్డును (ఆస్కార్) గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment