మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే గతేడాది నవంబరులోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి నిశ్చితార్థం చేసుకుంది. ఏంటి రెండు సార్లు చేసుకుందా అనుకుంటున్నారా? నిజమే, ఇందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? పెళ్లి కొడుకు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత)
ఉత్తరాది సినిమాల‍్ని ఓటీటీల్లో చూసేవారికి మరాఠీ హీరోయిన్ పూజా సావంత్ కాస్త పరిచయమే. ఎందుకంటే డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2010 నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 20కి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ షోల్లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరించింది. అలాంటిది గతేడాది నవంబరు చివర్లో ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది.
కాకపోతే అప్పుడు నిశ్చితార్థం ఎక్కడో ఐలాండ్‌లో జరగ్గా.. ఇప్పుడు మాత్రం ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం జరిగింది. అబ్బాయి విషయానికొస్తే.. ఇతడి పేరు సిద్దేశ్ చవన్. ఆస్ట్రేలియాలో ఓ ఫైనాన్స్ కంపెనీకి ఇతడు ఓనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఫొటోలు మాత్రమే పోస్ట్ చేశారు. అయితే త్వరలోనే పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. సహా నటీనటులు అందరూ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment