
సాక్షి, ముంబై: షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు ఆ హీరోయిన్‌ను ఇబ్బందులపాలు చేసింది. సదరు నటి బాత్రూమ్ వీడియో క్లిప్‌ను స్వయంగా నిర్మాతే లీక్ చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మూడు నెలల వేటాడిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకోగలిగారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
ఉపేంద్ర కుమార్ అనే నిర్మాత భోజ్‌పురీలో చిన్నా చితకా సినిమాలు, షార్ట్‌ఫిలింస్ తీసేవాడు. ఆ మధ్య ఓ ఔత్సాహిక హీరోయిన్‌ను పెట్టి షార్ట్ ఫిలిం తీశాడు. అందులో హీరోయిన్ స్నానం చేసి టవల్‌తో బయటికి వచ్చే సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. పొరపాటున టవల్ జారిపోవడం, అసభ్య దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడం జరిగిపోయింది. వెంటనే తేరుకున్న ఆ నటి.. పొరపాటున జరిగిన సీన్లను తొలగించాల్సిందిగా కోరింది. అందుకు సరేనన్న ఉపేంద్ర.. తర్వాత ఆ వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో లీక్ చేయటంతో వైరల్ అయ్యింది.
వీడియోను గుర్తించిన స్నేహితులు..: నిర్మాత ఆ సీన్లను డిలిట్ చేసి ఉంటాడని నమ్మిన నటి షూటింగ్ తర్వాత మిన్నకుండిపోయింది. కానీ అడల్ట్ వెబ్‌సైట్లలో వీడియో క్లిప్ వైరల్ అవుతున్న విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే జరిగిన ఘటనను వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోపే నిర్మాత ఉపేంద్ర కుమార్ బిహార్ వదిలి పారిపోయాడు. చివరకు ఆయా అడ్మిన్లతో మాట్లాడి నటి వీడియోను డిలిట్ చేయించారు సైబర్ బ్రాంచ్ పోలీసులు. మూడు నెలల గాలింపు అనంతరం ముంబైలోని బంధువుల ఇంట్లో ఉపేంద్ర జాడను కనిపెట్టి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment