
త్వరలోనే విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుపుతామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
సీతంపేట(విశాఖపట్నం): త్వరలోనే విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుపుతామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్టన్ ఎరీనాలో నిర్వహిస్తున్న గ్లోబల్ టేక్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో ఆధునిక టెక్నాలజీ ఆవిష్కరణతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాలపై చర్చ నిర్వహిస్తున్నారు. సదస్సులో వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జి–20 దేశాలతో పాటు మరో 25 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు, 300 వరకు ఐటీ కంపెనీలు పాల్గొన్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా అనుసరించాలి, వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చెయ్యాలి, అవసరమైన నాణ్యతా ప్రమాణాలపై చర్చ జరుగుతుంది.