
ప్రచారం చేస్తున్న నిర్మలా సీతారామన్
బొమ్మనహళ్లి : కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బెంగళూరు నగరంలో బెంగళూరు దక్షిణ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా ఆమె మహిళల వద్దకు వెళ్లి ‘పీజ్ ఓట్ ఫర్ బీజేపీ, సపోర్ట్ తేజస్వీ సూర్య’ అంటూ ప్రచారం చేస్తుండగా కొందరు మహిళలు కన్నడలో మాట్లాడితే ఓట్లు వేస్తామని చెప్పడంతో ఆమె నిర్ఘంతపోయారు. తనకు కన్నడ రాదని చెప్పడంతో నేర్చుకోండి అంటూ సలహా ఇచ్చారు. మరికొందరు నిర్మలా సీతారామన్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.