
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. రాజకీయ స్వార్థంతోనే రాహుల్, ప్రియాంక గాంధీ అత్యాచార ఘటనలను రాజకీయం చేస్తున్నారన్నారు. ఎంపిక చేసుకున్న ఘటనల పై మాత్రమే వారు మాట్లాడుతున్నారన్నారు.
ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేసేందుకు బీజేపీ అండగా నిలబడుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సోదరులపై గతంలో రేప్ కేసులు ఉన్నాయని, అందుకే వారు ఈ ఘటనపై మాట్లాడటం లేదని నిర్మల సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీడియాపై దాడులు జరుగుతున్నాయని, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ,వామపక్ష మేధావులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మేము ఏమి చేస్తామో మేనిఫెస్టోలో చెప్పే హక్కు మాకు ఉంది. కరోనా ఫ్రీ వ్యాక్సిన్ అంశం పై మాట్లాడుతూ, ఇది రాష్ట్ర జాబితాలోని అంశమని తెలిపారు. చదవండి: లాలూకి బెయిల్.. నితీష్‌కు ఫేర్‌వల్
Comments
Please login to add a commentAdd a comment