చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్‌రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.సెక్యులరిజంఅనే భావన యూరప్‌లో ఉందని, అది భారత దేశానికి సంబంధంలేనిదన్నారు. సోమవారం(సెప్టెంబర్23) ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్.ఎన్ రవి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
చర్చికి,రాజుకు మధ్య గొడవ జరిగి వారిద్దరూ దానిని ఆపేయాలనుకోవడం నుంచి యూరప్‌లో సెక్యులరిజం పుట్టిందన్నారు.ఇక భారత్‌లోకి సెక్యులరిజాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బుజ్జగింపు రాజకీయాల కోసం తీసుకువచ్చారని ఆరోపించారు.తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి తీవ్రస్థాయిలో విభేదాలున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలకు రాముడంటే తెలియదని రవి ఇటీవలే వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు.
ఇదీ చదవండి: కోల్‌కతాఘటన సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment