
చెన్నై:తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై,పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి చెన్నై,పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్‌వేలో వరద నీరు నిలిచింది.

ఇదీ చదవండి: మురసోలి సెల్వమ్ కన్నుమూత