చెన్నై:అమెరికా ఎన్నికల పోలింగ్ వేళ తమిళనాడు తులసేంద్రపురం గ్రామంలో సందడి నెలకొంది. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలాహారిస్ పూర్వీకులది ఇదే గ్రామం. తమ ఊరి బిడ్డ ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని తులసేంద్రపురం వాసులు గ్రామంలోని ఆలయంలో మంగళవారం(నవంబర్ 5) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పటికే కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ తులసేంద్రపురంలో పెద్ద బ్యానర్‌నే ఏర్పాటు చేశారు. గతంలో కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించినపుడు కూడా తులసేంద్రపురం వాసులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.
ప్రస్తుతం కమల ఏకంగా అధ్యక్ష పోరులోనే బరిలో ఉండడంతో ఆమె గెలుపుపై గ్రామ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. కమల ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టక ముందు కాలిఫోర్నియా అటార్నీగా పనిచేస్తున్నపుడు తులసేంద్రపురంలోని గ్రామ ఆలయానికి 60 డాలర్లు విరాళమివ్వడం గమనార్హం.
ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment