చెన్నై: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలైంది. అధికార పార్టీ డీఎంకే ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ‘హక్కుల కోసం స్టాలిన్ పోరు’ పేరుతో ప్రచార భేరి మోగించింది. చెన్నైలోని మూడు, పుదుచ్చేరిలోని ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం తప్ప రాష్ట్రంలోని 37 లోక్‌సభ స్థానాల్లో ఒకేసారి ప్రచారం ప్రారంభించింది.
సాధారణంగా తమిళనాడులో ఎన్నిక ఏదైనా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే ఈసారి అనూహ్యాంగా డీఎంకే నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి ప్రారంభించారు. తమిళనాడుకు అన్యాయం చేస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నిధులు రావాలన్నా,మైనారిటీల హక్కులు కాపాడాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిందేనన్నారు.
విరుదునగర్ జిల్లాలో జరిగిన ప్రచారంలో ఎంపీ కనిమొలి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు నిధులివ్వకపోయినప్పటికీ స్టాలిన్ విద్య,వైద్యం రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని చెప్పారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకూడదని, వారు ఒక వర్గం ప్రజలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి శేఖర్‌బాబు ఆరోపించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే ఫైల్స్ 3 పేరుతో టూ జీ కుంభకోణానికి సంబంధించి డీఎంకే నేతల ఆడియో విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment