సాక్షి, చెన్నై(తమిళనాడు): జోరువానలోనూ ఓ జంట అతికష్టం మీద వివాహం చేసుకోవాల్సి వచ్చింది. చెన్నైకి చెందిన ప్రభు, ముత్తులక్ష్మికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. తేనాంపేటలోని ఓ పెద్ద కల్యాణ మండపాన్ని బుక్ చేశారు. ఆహ్వానాలు కూడా పంపించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి తేనాంపేట పరిసరాల్లో నడుం లోతు వరకు నీరు నిలిచింది. దీంతో పెళ్లి వారికి కష్టా లు మొదలయ్యాయి.
చివరకు వధూవరులు, బంధు వులను ప్రైవేటు బోట్ల ద్వారా మూడు కి.మీ దూరం తీసుకెళ్లాల్సి వచ్చింది. పెళ్లి అనంతరం కొత్త జంట బోటులో ఊరేగింపుగా ముందుకు సాగింది. వరుడు ప్రభు మాట్లాడుతూ పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఏర్పాట్లు చేశామన్నారు. ఊరేగింపునకు లగ్జరీ కారు, బ్యాండు మేళా, గానా భజానా సమకూర్చుకున్నా చివరకు బోటులో వెళ్లాల్సి వచ్చిందన్నారు. పడవ ప్రయాణం జీవితంలో తీపి గుర్తుగా నిలిచిపోయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment