boats to help
-
ఈ వర్షం సాక్షిగా... నువ్వు నాకే సొంతం!
సాక్షి, చెన్నై(తమిళనాడు): జోరువానలోనూ ఓ జంట అతికష్టం మీద వివాహం చేసుకోవాల్సి వచ్చింది. చెన్నైకి చెందిన ప్రభు, ముత్తులక్ష్మికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. తేనాంపేటలోని ఓ పెద్ద కల్యాణ మండపాన్ని బుక్ చేశారు. ఆహ్వానాలు కూడా పంపించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి తేనాంపేట పరిసరాల్లో నడుం లోతు వరకు నీరు నిలిచింది. దీంతో పెళ్లి వారికి కష్టా లు మొదలయ్యాయి. చివరకు వధూవరులు, బంధు వులను ప్రైవేటు బోట్ల ద్వారా మూడు కి.మీ దూరం తీసుకెళ్లాల్సి వచ్చింది. పెళ్లి అనంతరం కొత్త జంట బోటులో ఊరేగింపుగా ముందుకు సాగింది. వరుడు ప్రభు మాట్లాడుతూ పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఏర్పాట్లు చేశామన్నారు. ఊరేగింపునకు లగ్జరీ కారు, బ్యాండు మేళా, గానా భజానా సమకూర్చుకున్నా చివరకు బోటులో వెళ్లాల్సి వచ్చిందన్నారు. పడవ ప్రయాణం జీవితంలో తీపి గుర్తుగా నిలిచిపోయిందన్నారు. -
బాధితులకు ఓలా పడవల సేవలు..
ప్రముఖ క్యాబ్ సర్వీసులను అందిస్తున్న ఓలా... ఉత్తరప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించింది. తమ సంస్థకు చెందిన బోట్ల ద్వారా వరదల్లో చిక్కకున్న వారిని ఒడ్డుకు చేరుస్తోంది. అందుకోసం అనుభవజ్ఞులైన రోవర్లను ఏర్పాటు చేసింది. వరదలతో ముంచెత్తిన ఉత్రర ప్రదేశ్ ప్రజలకు ఓలా తనవంతు సహకారం అందిస్తోంది. రాష్ట్రంలోని వరద ప్రభావం ఎక్కువగా ఉన్న అలహాబాద్, వారణాసిల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఓలా సాయం చేస్తోంది. ముంపు బాధితులకు ఆహారం, నీరు, మందులను అందించేందుకు కూడా ఓలా బోట్లు సహకరిస్తున్నాయి. నిరాశ్రయులను ఆదుకోవడం కోసం ఓలా తన యాప్ లో ప్రత్యేక కేటగిరీని కూడా ప్రవేశ పెట్టింది. దీనిద్వారా ఆహార పదార్థాలు, దుస్తులు, మందులను అందించే వీలు కల్పిస్తోంది. ఇంతకు ముందు చెన్నై, గౌహతీల్లో వరదలు సంభవించిన సమయంలోనూ ఓలా సహాయక చర్యల్లో పాల్గొంది. చెన్నై వరద బాధితులను ఓలా పడవల్లో తరలించేందుకు తోడ్పడింది. సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా సంస్థ.. తమ యాప్ లో ఫ్లడ్ రిలీఫ్ అనే ప్రత్యేక కేటగిరీని జత చేసింది.