బాధితులకు ఓలా పడవల సేవలు..
ప్రముఖ క్యాబ్ సర్వీసులను అందిస్తున్న ఓలా... ఉత్తరప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించింది. తమ సంస్థకు చెందిన బోట్ల ద్వారా వరదల్లో చిక్కకున్న వారిని ఒడ్డుకు చేరుస్తోంది. అందుకోసం అనుభవజ్ఞులైన రోవర్లను ఏర్పాటు చేసింది.
వరదలతో ముంచెత్తిన ఉత్రర ప్రదేశ్ ప్రజలకు ఓలా తనవంతు సహకారం అందిస్తోంది. రాష్ట్రంలోని వరద ప్రభావం ఎక్కువగా ఉన్న అలహాబాద్, వారణాసిల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఓలా సాయం చేస్తోంది. ముంపు బాధితులకు ఆహారం, నీరు, మందులను అందించేందుకు కూడా ఓలా బోట్లు సహకరిస్తున్నాయి. నిరాశ్రయులను ఆదుకోవడం కోసం ఓలా తన యాప్ లో ప్రత్యేక కేటగిరీని కూడా ప్రవేశ పెట్టింది. దీనిద్వారా ఆహార పదార్థాలు, దుస్తులు, మందులను అందించే వీలు కల్పిస్తోంది. ఇంతకు ముందు చెన్నై, గౌహతీల్లో వరదలు సంభవించిన సమయంలోనూ ఓలా సహాయక చర్యల్లో పాల్గొంది. చెన్నై వరద బాధితులను ఓలా పడవల్లో తరలించేందుకు తోడ్పడింది. సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా సంస్థ.. తమ యాప్ లో ఫ్లడ్ రిలీఫ్ అనే ప్రత్యేక కేటగిరీని జత చేసింది.