‘అధికారులు వేధిస్తున్నారని మాకు చెప్పేది.. ఇది హత్యే’ | Relatives Protest On Woman Asi Commits Suicide Vizianagaram | Sakshi
Sakshi News home page

‘అధికారులు వేధిస్తున్నారని మాకు చెప్పేది.. ఇది హత్యే’

Published Sun, Aug 29 2021 9:32 PM | Last Updated on Sun, Aug 29 2021 10:02 PM

Relatives Protest On Woman Asi Commits Suicide Vizianagaram - Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఎస్సై ట్రైనింగ్ లో ఉన్న కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాని అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వేధిస్తున్నారని ఆమె తమతో చెప్పేదని‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్సై ఆత్యహత్య చేసుకున్న విషయం తెలియడంతో స్వగ్రామమైన కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

భవాని తన తల్లి అన్నలతో నివసిస్తోంది. శిక్షణ కోసం వెళ్తున్నట్లు ఇంటివద్ద తల్లికి చెప్పి వెళ్లిన భవాని ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. భవాని స్వగ్రామమైన సాలెంపాలెంలో బంధువులు, గ్రామస్తులు భవానిని హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, దోషులను శిక్షించి వారి కుటంబసభ్యులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

చదవండి: 6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement