సాక్షి,ప్రకాశం: విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి స్పందించారు. తాను 2004లో కొనుగోలు చేసిన అనంతరం లేఅవుట్‌కు అనుమతుల కోసం అప్లై చేయగా 2009లో అప్రోవుల్‌కు అనుమతులు వచ్చాయన్నారు. 2011లో నా కూతురుని బాలినేని కుమారుడికి ఇచ్చానని, అప్రోవల్ వచ్చేనాటికి బాలినేనికి తమకు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు.
పోలిటికల్ సఫరర్స్ భూములను కొనుగోలు చేయవలసిన నీచమనస్థత్వం తమది కాదని, ఫారెస్ట్, పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. దీనిపై ఎటువంటి విచారణకైన సిద్దమేనని చెప్పారు. తాను ఒక్క సెంట్ ఆక్రమించానని నిరూపించినా ఆ ల్యాండ్ మెత్తాన్ని ప్రభుత్వానికి రాసిస్తానన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాలినేనితో రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి.. అంతేకాని దానికి నా వ్యాపార ప్రాజెక్టులతో ముడిపెట్టడం మంచి పద్దతి కాదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇటువంటి ఆరోపణలు చేస్తే చట్టపరంగా తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment