- ఆందోళనకుదిగిన మృతుడి కుటుంబసభ్యులు
ఎంజీఎం : వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, మిత్రులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కథనం ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గకు చెందిన సీహెచ్. అమర్‌నాథ్(18) ఈనెల 5వ తేదీన కృష్టాష్టమి వేడుకల్లో గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిటయ్యూడు. కాలుతోపాటు నడుముకు తీవ్రగాయాలు కావడంతో అమర్‌నాథ్‌ను ఆర్థోవార్డులో అడ్మిట్ చేశారు. అప్పట్నుంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈక్రమంలో ఈనెల 6వ తేదీ నుంచి అమర్‌నాథ్ జ్వరంతో బాధపడుతున్నాడు. మరుసటి రోజు జ్వరం తీవ్రమైంది. సోమవారం రాత్రి పరిస్థితి విషమించింది. శ్వాసతీసుకోవడం సైతం ఇబ్బంది కరంగా మారింది. దీంతో సిబ్బంది వెంటనే క్యాజువాలిటీకి తరలించారు. అరుుతే, వైద్య చికిత్సలు అందిస్తున్న క్రమంలోనే అమర్‌నాథ్ మృతి చెందాడు. వైద్యులు సక్రమంగా వైద్యం చేయలేదని, అందుకోసమే అమర్‌నాథ్ మృతి చెందాడని బంధువులు, మిత్రులు ఆరోపించారు. వైద్యులు నిర్లక్ష్యం చేశారంటూ ఆందోళనకు దిగారు. అనంతరం మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఎంజీఎం పరిపాలనాధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి
Published Wed, Sep 9 2015 4:42 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement