జిల్లాలో భారీ వర్షానికి వంక పొంగి ప్రవహించడంతో యువకుడు కొట్టుకుపోయాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సాక్షి, బళ్లారి : జిల్లాలో భారీ వర్షానికి వంక పొంగి ప్రవహించడంతో యువకుడు కొట్టుకుపోయాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా కరూరు గ్రామంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గిపోయిన తర్వాత గ్రామానికి చెందిన నాగరాజు(20) అనే యువకుడు తోటలోకి వెళ్లాలనే ఉద్దేశంతో వంకను దాటుతున్నాడు. ఆ సమయంలో భారీగా ప్రవాహం రావడంతో కొట్టుకుపోయాడు.
ఈ విషయం తెలియగానే బంధువులు, స్నేహితులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చర్య చేపట్టారు. ఒక్కగానొక్క కుమారుడు నీటి పాలు కావడంతో తల్లిదండ్రులు రెడ్డప్ప, రేణుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డిప్లమో చదువుతూ సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన తమ కుమారుడు ఇలా నీటిలో కొట్టుకు పోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సిరిగేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.