ఆస్తి కోసం చంపాలని చూస్తున్నారు | relatives looking to kill for property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం చంపాలని చూస్తున్నారు

Published Fri, Apr 14 2017 10:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

relatives looking to kill for property

బుచ్చిరెడ్డిపాళెం : ఆస్తి కోసం తనకు మరిది వరస అయ్యే వ్యక్తి తనను చంపాలని చూస్తున్నారని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన ముంగర మాలిని ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాళెంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముంగర రామచంద్రారెడ్డికి బాలశంకర్‌ రెడ్డి, సదాశివరెడ్డి, విశ్వనా«థ్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, రామలింగారెడ్డి కుమారులని తెలిపింది. వీరిలో బాలశంకర్‌రెడ్డి కుమారుడు తన భర్త అని, ఉమ్మడిగా ఉన్న ఓ థియేటర్, 24 ఎకరాల భూమిని రామచంద్రారెడ్డి ఐదు భాగాలు చేశారన్నారు.

అయితే విశ్వనాథ్‌రెడ్డి కుమారుడు విక్రమ్‌కుమార్‌రెడ్డి ఆరో భాగం అతనికి కేటాయించినట్లు ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టుకు వెళ్లాడని, దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారన్నారు. ఈ ఆస్తిలో బాలశంకర్‌రెడ్డి కోడలిగా తనకు రావాలి్సన వాటా ఇవ్వకుండా తనను చంపేందుకు విక్రమ్‌కుమార్‌రెడ్డి మరి కొంతమంది సహాయంతో ప్రయత్నిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు

20 మందిపై కేసు నమోదు
మాలినిపై బుధవారం రాత్రి హత్యాయత్నానికి ప్రయత్నించిన 20 మందిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరూ కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement