జోగిపేట: వితంతువుపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం ఎస్ ఇటిక్యాలలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మిన్పూరు మల్లమ్మ (28) భర్త చనిపోవడంతో ఇటిక్యాల గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ కల్లు డిపోలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ నెల 20న పనికి వెళ్లిన మల్లమ్మ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుం బసభ్యులు బంధువులు, తెలిసిన వారివద్ద వాకబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 24న ఆమె సోదరుడు పుల్‌కల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలావుండగా, సోమవారం అదే గ్రామానికి చెందిన మేకల కాపరి మల్లేశం శివారులోని చెరకుతోటలో మహిళ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు విషయం చెప్పాడు.
మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. చీర ఆధారంగా మృతదేహం మల్లమ్మదిగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ నాగయ్య, ఎస్‌ఐ లోకేశ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ముఖం గుర్తించనంతగా ఉంది, రెండు కాళ్లు కూడా లేవు. ఒక చేయి మోచేతి వరకే ఉంది. ఆనవాళ్లను బట్టి ఎవరో అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
మహిళపై అత్యాచారం, హత్య
Published Tue, Dec 30 2014 2:54 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement