పశ్చిమగోదావరి: భూ వివాదం రెండు బంధువర్గాల మధ్య వివాదాన్ని తీసుకొచ్చింది. అది కాస్త ఘర్షణగా మారి కత్తులు దూసుకునే వరకు వచ్చింది. ఈఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో పొలం విషయంలో భూ వివాదం నెలకొని రెండు బంధువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గంపై మరో వర్గం కత్తులతో దాడికి దిగింది. దీంతో తేలి సూర్యారావు, మెంటే పెంటయ్య, జంగ రాజు అనే వ్యక్తులు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.