భర్తను గొడ్డలితో నరికిన భార్య | Wife Attack On Husband Warangal | Sakshi
Sakshi News home page

భర్తను గొడ్డలితో నరికిన భార్య

Published Sat, Oct 20 2018 12:44 PM | Last Updated on Thu, Oct 25 2018 1:35 PM

Wife Attack On Husband Warangal - Sakshi

కురవి(డోర్నకల్‌): దసరా పండుగ రోజు మద్యం తాగి వచ్చి గొడవ పడడంతో ఆగ్రహించిన భార్య గొడ్డలితో భర్తను నరకగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. దసరా పండుగ సందర్భంగా రాజోలు గ్రామంలో మీరంపల్లి ఉపేందర్‌ తాగిన మైకంలో భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన భార్య సావిత్రి గొడ్డలితో అతడి తలపై నరికింది.

తీవ్రంగా గాయపడగా మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సఅందిస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని కురవి ఎస్సై నాగభూషణం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement