
సంతోష్‌నగర్: నగరంలో నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమ పేరిట వివాహితను వేధిస్తూ.. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా పొడవడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కంచన్‌బాగ్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్ ఎ–బ్లాక్ ప్రాంతానికి చెందిన నూర్ భాను (40) భర్త ఇంతియాజ్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నూర్ భాను కుమారుడితో కలిసి నివాసముంటోంది.
కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన షేక్ నసీరుద్దీన్ ఆలియాస్ హబీబ్ (32) ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నూర్ భాను బాబానగర్ ఉమర్ హోటల్ సమీపానికి రాగానే...షేక్ నసీరుద్దీన్ వెనుక నుంచి యాక్టివా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముఖం, చేతులు, ఇతర ప్రాంతాల్లో కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బాధితురాలిని నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా నిందితుడి మీద గతంలో కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.
(చదవండి: ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపమైందా?)
Comments
Please login to add a commentAdd a comment