సాక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో గుజరాత్ పోలీసులపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. పోలీసులపై హత్యాయత్నం చేసినట్లు రుజువు కాలేదని, దాడికి పాల్పడినట్లు మాత్రమే తేలడంతో ముఖీముద్దీన్ యాసిర్, బలివుద్దీన్ జాబేర్, మహ్మద్ షఫిక్‌లకు జైలు శిక్ష పడింది. ఈ ముగ్గురికి సెక్షన్ 148 కింద ఏడాది జైలు, 5 వేల జరిమానా, సెక్షన్ 324 కింద ఏడాది జైలు రూ.వెయ్యి జరిమానా, సెక్షన్ 332 కింద రెండేళ్లు జైలు, రూ.వెయ్యి జరివూనా విధించింది. మౌతసిమ్‌బిల్లా, మహ్మద్ షకీల్‌లను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. ఈ కేసులో 35 మందిని నిందితులుగా చేర్చగా ఐదుగురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన 30 మంది నిందితుల్లో డీజేఎస్ అధ్యక్షుడు మహబూబ్‌అలీ మృతి చెందగా మరో 29 మంది పరారీలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కాగా, శిక్ష పడిన ముగ్గురికి నాంపల్లి కోర్టు రూ.10 వేల షూరిటీలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
గుజరాత్ పోలీసులపై దాడి కేసులో ముగ్గురికి జైలు
Published Wed, Oct 29 2014 2:47 AM | Last Updated on Tue, Aug 21 2018 2:29 PM
Advertisement
Advertisement