జిల్లాలోని మార్కాపురంలో ఎస్సీ బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు దారుణానికి పల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్సీ బీసీ కాలనీకి చెందిన మురారి జలయ్య, తల్లి లక్ష్మి కుమారుడు ప్రసాద్ బర్త్‌డే వేడుకలకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంట్టించాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడటంతో గ్రామంలోని ప్రజలు భయందోళనకు గురైయ్యారు.