
చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు నారాయణ
రాజంపేట : పట్టణంలోని మన్నూరుకు చెందిన టీడీపీ నాయకుడు బండారు బాలయ్య తనపై దాడి చేసి గాయపరిచినట్లు వైఎస్సార్‌సీపీ నాయకుడు నారాయణ తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున తాను పనిచేశాననే కక్షతోనే తనపై దాడి చేసినట్లు ఆరోపించారు. బండారు బాల య్య, ఆయన సంబంధీకులు దౌర్జన్యంగా తన ఇంటిపైకి వచ్చి దాడికి దిగారన్నారు. చికిత్స కో సం ఏరియా ఆసుపత్రికి వస్తే ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రెఫర్ చేయలేదన్నారు. అధికారపార్టీ ఒత్తిడికి తలొగ్గే వైద్యులు ఇలా వ్యవహరించారన్నారు. కాగా గాయపడిన నారాయణను వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డి, నాయకుడు విశ్వనాథరాజు, పలువురు పట్టణ నాయకులు పరామర్శించారు.
కేసులు నమోదు చేశాం
మన్నూరులో జరిగిన ఘటనపై ఇరువర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్‌నాయుడు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణను కలిసి ఘర్షణకు కారణమైన వివరాలను సేకరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment