
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న హన్మంతు
పెద్దేముల్(తాండూరు): భార్యాభర్తల గొడవలో పక్కింటి వ్యక్తి తలదూర్చాడు. దీంతో దంపతులిద్దరూ ఏకమై మా సమస్య గురించి నీకెందుకు అని వారించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి తన ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి భర్తను దాడి చేసిన సంఘటన పెద్దేముల్ పొలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండల బండపల్లి గ్రామానికి చెందిన చిన్నింటి బుజ్జమ్మ భర్త హన్మంతులు ఆదివారం రాత్రి సుమారు 9:30 సమయంలో కుటుంబ విషయమై గొడవ పడుతున్నారు.ç పక్కింటి వ్యక్తి చిన్నింటి రాములు వచ్చి గొడవ ఏంటీ..? నిత్యం ఇదేనా అంటూ మందలించాడు. దీంతో నీవు మా వద్దకు ఎందుకు వచ్చావు..? నీకు మా సంసారం విషయంతో సంబంధం ఏంటీ అంటు హన్మంతు రాములును ప్రశ్నించాడు.
దీంతో రాములు పక్కనే ఉన్న రాడ్డుతో హన్మంతుపై దాడికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. అప్పటికే మద్యం మత్తుల్లో ఉన్న చిన్నింటి రాములు ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి హన్మంతు తలపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన హన్మంతును గ్రామస్తులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుభాష్ అదే రాత్రి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గతంలో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. అని ఆరా తీశారు. హన్మంతు భార్య బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు రాములును అదుపులోకి తీసుకొని కేసు నమేదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment