
పవన్ అభిమానిపై దాడి: పోలీసుల అదుపులో నలుగురు
గోపాల.. గోపాల ఆడియో విడుదల కార్యక్రమం వద్ద పాస్లు ఇవ్వలేదన్న కారణంగా పవన్ కల్యాణ్ అభిమానిపై దాడిచేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి సంబధించిన వీడియో ఫుటేజి ఆధారంగా వీరిని గుర్తించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో.. కుమారస్వామి, నరేష్ కుమార్, రాకేష్, రంజిత్ అనే నలుగురు ఉన్నారు. వీళ్లు చేసిన దాడిలో కరుణ శ్రీనివాస్ అనే పవన్ కల్యాణ్ అభిమాని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పవన్ స్వయంగా పరామర్శించి, రూ. 50 వేల సాయం కూడా చేశారు.