Karuna srinivas
-
పవన్ అభిమానిపై దాడి: పోలీసుల అదుపులో నలుగురు
గోపాల.. గోపాల ఆడియో విడుదల కార్యక్రమం వద్ద పాస్లు ఇవ్వలేదన్న కారణంగా పవన్ కల్యాణ్ అభిమానిపై దాడిచేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి సంబధించిన వీడియో ఫుటేజి ఆధారంగా వీరిని గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో.. కుమారస్వామి, నరేష్ కుమార్, రాకేష్, రంజిత్ అనే నలుగురు ఉన్నారు. వీళ్లు చేసిన దాడిలో కరుణ శ్రీనివాస్ అనే పవన్ కల్యాణ్ అభిమాని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పవన్ స్వయంగా పరామర్శించి, రూ. 50 వేల సాయం కూడా చేశారు. -
అభిమానికి పవన్ కళ్యాణ్ పరామర్శ
-
అభిమానికి పవన్ కళ్యాణ్ పరామర్శ
హైదరాబాద్: 'గోపాల గోపాల' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దుండగుడి దాడిలో గాయపడిన అభిమాని కరుణ శ్రీనివాస్ ను హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం పరామర్శించారు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో కలిశారు. అతడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ భార్యాపిల్లలతో మాట్లాడారు. దాదాపు గంటసేపు వారితో గడిపారు. అతడి వైద్యానికి అయిన ఖర్చులతో పాటు మరో యాభైవేల రూపాయాల సహాయం ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.