
దాడి కేసులో నిందితుల అరెస్ట్
వరంగల్ జిల్లా: కేసముద్రం మండలంలో క్వారీ మేస్త్రీని బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఆరుగురి నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శ్రీను, సర్దార్, పృథ్వీరాజ్, పుచ్చకాయల నరేష్, గోపి, భరత్‌లుగా గుర్తించారు. బాబు అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సెవ్యా అలియాస్ శ్రీను అనే వ్యక్తి పనికి వెళ్లని రోజుల్లో కూడా జీతం చెల్లించాల్సిందిగా మేస్త్రీని కోరాడు. మేస్త్రీ ఒప్పుకోకపోవడంతో తన స్నేహితులతో కలసి మేస్త్రీ దగ్గర ఉన్న రెండుతులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. అంతేకాకుండా మద్యం సేవించి మేస్తీపై దాడికి పాల్పడ్డారు. మేస్త్రీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.