
సాక్షి, హనుమాన్ జంక్షన్ : బ్యూటీషియన్ పద్మపై దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ తాజాగా ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అన్నది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీతను పోలీసులు సోమవారం విచారించారు. తన భర్త చనిపోవడానికి బ్యూటీషియన్ పద్మనే కారణమని సునీత తెలిపింది.
2012లో తమ వివాహం జరిగిందని, తన భర్త నూతన్ ఓ ప్రైవేటు షోరూంలో మేనేజర్ గా పనిచేసేవారని తెలిపింది. ఆ సమయంలో అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న పద్మ తన భర్తను లోబరుచుకుందని ఆమె ఆరోపించారు. తన భర్తకు ఇష్టం లేకున్నా వేధింపులకు గురిచేసిందని, విడాకులు తీసుకోవాల్సిందిగా నూతన్‌ను పద్మ హింసించిందని సునీత తెలిపింది. ప్రసుత దారుణమైన పరిస్థితులన్నింటికీ పద్మే కారణమని తెలిపింది. మరోవైపు బ్యూటీషియన్ పద్మ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్న నూతన్ కుమార్ మృతదేహానికి ఇదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment