ఢిల్లీ: ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఒవైసీ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అయితే.. ఈ అంశాన్ని పునర్విచారణ కోసం అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలా వద్దా అనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు ఇవాళ నోటీసు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11న చేపట్టనుంది.
హాపూర్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన కాన్వాయ్‌పై ఫిబ్రవరి 3వ తేదీన దాడి జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. అయితే దాడి నుంచి ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ హత్యాయత్నానికి సంబంధించి నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు బెయిల్ మంజూరు కావడంతో ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment