
విద్యార్థులను మోస్తూ వాగు దాటించిన ఉపాధ్యాయుడు
పెంచికల్‌పేట్ (సిర్పూర్): విద్యార్థులను భుజంపై ఎత్తుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె దాటించి వారి ప్రాణాలు కాపాడారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
పెంచికల్‌పేట్ మండలం జైహింద్‌పూర్ గ్రామ సమీపంలోని చెరువు నిండి మత్తడి దూకింది. ప్రాథమిక పాఠశాలల సమీపంలోని ఒర్రెలోకి భారీగా వరద చేరింది. పాఠశాలలో మొత్తం 30 మంది చదువుతుండగా.. ఒర్రెకు అవతలి వైపు నుంచి నిత్యం 20 మంది వరకు పాఠశాలకు వస్తుంటారు. గురువారం పాఠశాల ముగిసిన అనంతరం ఉపాధ్యాయుడు సంతోష్ గ్రామస్తుల సాయంతో విద్యార్థులను ఎత్తుకుని ఇలా వాగు దాటించారు.
Comments
Please login to add a commentAdd a comment