కన్నడ టీచర్.. ఈ ఆటోడ్రైవర్
అజ్మల్ బాషా సేవ
బొమ్మనహళ్లి: బెంగళూరు కర్ణాటక రాజధాని అన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ కొన్ని లక్షల మందికి కన్నడ రాదు, తెలియదు. అదే పెద్ద వింత. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇందులో ఎక్కువ. అటువంటి వారికి కొంచైమెనా కన్నడ కస్తూరి గొప్పతనాన్ని వివరించాలని ఓ ఆటోడ్రైవర్ కంకణం కట్టుకున్నాడు. అతనే బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ అజ్మల్ సుల్తాన్. ఆటోలో కొన్ని పోస్టర్లను అతికించాడు.
అందులో ఆంగ్ల, కన్నడ పదాల అర్థాలు ఉన్నాయి. ఎవరైనా సులభంగా కన్నడను తెలుసుకోవచ్చు. నమస్కార సార్– హెలో సార్, ఎల్లి ఇదిరా– వేర్ ఆర్ యూ?, ఎస్ట్ అయితు– హౌ మచ్?, యూపిఐ ఇదియా క్యాష్ నా– ఈజ్ ఇట్ యుపిఐ, ఆర్ క్యాష్? అనే చిన్న చిన్న పదాలతో పోస్టర్లు ఉన్నాయి. చాలా సరళంగా కన్నడను అర్థం చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. కన్నడ రానివారు ఆటోలో ఎక్కినప్పుడు గమ్యం చేరేవరకు కొన్ని కన్నడ పదాలను నేర్పించే యత్నం చేస్తానని చెప్పాడు. ఆయన కృషి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment