
కర్ణాటక: మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ విచ్చలవిడిగా ఆటో నడపడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా ఓ పాదచారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన బాగేపల్లి రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... బాగేపల్లి రోడ్డులోని శ్రీనివాసపుర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకట రమణ మద్యం తాగి ఒక్కడే ఆటోలో సొంత ఊరుకు బయలుదేరాడు.
ఈ క్రమంలో వేగంగా వస్తూ మార్గం మధ్యలో రోడ్డుపై నడుచుకుని వెళ్తున్న నవీన్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నవీన్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ధ్వంసమైన ఆటో

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు
Comments
Please login to add a commentAdd a comment