సాక్షి ప్రతినిధి, నల్లగొండ/కరీంనగర్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ, కరీంనగర్, మెదక్, నిజా మాబాద్, ఆదిలాబాద్ జిల్లాల, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ల ఎన్నికకు సోమవా రం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.11న నామినేషన్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.
నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నల్లగొండ కలెక్టరేట్ బయట 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్లలోపు మూడు వాహనాలు, నామినేషన్ అభ్యరి్థతో కలిపి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి నా మినేషన్లను నల్లగొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఎన్నికల రిటరి్నంగ్ అధికారిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరిస్తారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కలెక్టర్ పమేలా సత్పతి ఆర్‌వోగా వ్యవహరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు కరీంనగర్ కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment