mlc nominations
-
నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/కరీంనగర్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ, కరీంనగర్, మెదక్, నిజా మాబాద్, ఆదిలాబాద్ జిల్లాల, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ల ఎన్నికకు సోమవా రం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.11న నామినేషన్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నల్లగొండ కలెక్టరేట్ బయట 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్లలోపు మూడు వాహనాలు, నామినేషన్ అభ్యరి్థతో కలిపి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి నా మినేషన్లను నల్లగొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఎన్నికల రిటరి్నంగ్ అధికారిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరిస్తారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కలెక్టర్ పమేలా సత్పతి ఆర్వోగా వ్యవహరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
చేతులెత్తి మొక్కుతున్నాం..
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు. రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి– హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, హైదరాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గానికి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 తేదీ వరకు (సెలవు దినాలు మినహా) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు.. ►ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల నిర్వహణకు అంశాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. వివరాలిలా ఉన్నాయి. ►జి.వెంకటేశ్వర్లు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకర ణ): బ్యాలెట్‌పత్రాలు, బ్యాలెట్‌బాక్సుల తయారీ. ►పి.సరోజ(అడిషనల్ కమిషనర్, పరిపాలన): ఎన్నికల సామాగ్రి సేకరణ. ►సంధ్య(జేసీ, శానిటేషన్): ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది. ►పద్మజ( సీఎంఓహెచ్):హెల్త్‌కేర్ కార్యక్రమాలు,కోవిడ్ నిబంధనలు. ► కె.నర్సింగ్‌రావు:( డీఈఈ, ఐటీ): వెబ్‌క్యాస్టింగ్,ఐటీ సంబంధిత అంశాలు. ►శ్రుతిఓజా (అడిషనల్ కమిషనర్), సౌజన్య( పీడీ), యూసీడీ: శిక్షణ కార్యక్రమాలు ►ఎన్.ప్రకాశ్‌రెడ్డి (డైరెక్టర్, ఈవీడీఎం): ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతలు,వాహనాలు ►మహ్మద్ జియా ఉద్దీన్(ఈఎన్సీ): పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు ►ముర్తుజాఅలీ(సీపీఆర్ఓ): ఓటరు అవగాహన కార్యక్రమాలు, మీడియాసెల్, పెయిడ్‌న్యూస్ ►బాషా(ఎస్టేట్ ఆఫీసర్): 24 గంటల ఫిర్యాదుల విభాగం, కాల్‌సెంటర్ ఫిర్యాదుల పరిష్కారం ►మహేశ్ కులకర్ణి( చీఫ్వాల్యుయేషన్ఆఫీసర్): రిపోర్టులు ► విజయభాస్కర్‌రెడ్డి(పర్సనల్ ఆఫీసర్): పోస్టల్‌బ్యాలెట్ 25న స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితా హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలో 118 మంది ఓటర్లున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, రాజ్యసభల సభ్యులు ఓటర్లు. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఈనెల 23వ తేదీ వరకు స్వీకరించి తుదిజాబితా 25న వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కోటాలోని ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్జాఫ్రి పదవీకాలం మే 1వ తేదీతో ముగియనున్నందున ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. -
టీడీపీలో కనిపించని సామాజిక న్యాయం
-
ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం
-
ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ
మూడు నామినేషన్లు దాఖలు అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 9 నుంచి మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి లక్ష్మీకాంతం తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ నాలుగు సెట్లు, పయ్యావులు శ్రీనివాసులు ఒక సెట్టు, యాట వెంకటసుబ్బన్న ఒక సెట్టు మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారన్నారు. బుధవారం నామినేషన్లను స్క్రూటినీ చేస్తామని చెప్పారు. ఉపసంహరణకు ఈ నెల 19వ తేదీ చివరి రోజని, అదే రోజు మధ్యాహ్నం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.