కర్ణాటక: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకా మేలుకోటె దగ్గర మాణిక్యనహళ్ళికి చెందిన వి. దీపిక గౌడ (28) అనే ప్రైవేటు స్కూలు టీచర్ అదృశ్యమై, ఆపై హత్యకు గురికావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మేలుకోటెలో ప్రసిద్ధ యోగ నరసింహ స్వామి కొండ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం సోమవారం సాయంత్రం బయటపడింది.
ఫోన్ రాగానే స్కూలు నుంచి వెళ్లి..
వివరాలు.. మానిక్యనహళ్ళిలో వెంకటేష్ కుమార్తె అయిన దీపికకు అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకునితో పెళ్లయింది, వారికి 8 ఏళ్ల కూతురు ఉంది. మేలుకోటెలోని ఎస్‌ఈటి పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా ఆమె పనిచేసేది. గ్రామం నుంచి రోజూ తన డియో స్కూటర్‌లో స్కూలుకు వెళ్లి వచ్చేది. ఈ నెల 20వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్కూలు అయిపోగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రావడంతో స్కూటర్‌లో వెళ్లిపోయింది.
అప్పటినుంచి ఆమె జాడ లేదు. ఆమె శవం దొరికిన చోటుకు కొంతదూరంలో స్కూటర్ పార్క్ చేసింది. సోమవారం కూడా స్కూటర్ అక్కడే ఉండడం చూసి స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి స్కూటర్ వివరాలను బట్టి దీపకదిగా గుర్తించి ఆమె తండ్రి వెంకటే‹Ùను కలిసి మాట్లాడారు. ఈ నెల 20వ తేదీనే తమ కూతురు మిస్సింగ్ అని మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పాడు. చివరకు స్కూటర్ చుట్టుపక్కల ప్రజలతో కలిసి గాలించగా పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం లభ్యమైంది.
టిక్‌టాక్ వీడియోలు
దీపిక సినిమా హీరోయిన్‌కు తీసిపోని అందంతో ఆకట్టుకునేది. ఇన్‌స్టా, యూట్యూబ్‌తో పాటు గతంలో టిక్‌టాక్‌లో సినిమా పాటలు, డైలాగుల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది. ఆమెకు ఎంతోమంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. దీంతో ఆమె టిక్‌టాక్ దీపికగా స్థానికంగా ఎంతో పేరుపొందింది.
పరారీలో యువకుడు
పోలీసులు మృతదేహాన్ని వెలిసితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శవంపై ఎలాంటి గాయాలు లేవని, ఎవరో దుండగులు చంపి పూడ్చిపెట్టారని తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆమెకు చివరిసారి కాల్ చేసింది నితిన్ అనే యువకుడు అని, అతడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment