స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు! | Kerala School Gets AI Teacher | Sakshi
Sakshi News home page

స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు ! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..!

Published Tue, Mar 5 2024 3:35 PM | Last Updated on Tue, Mar 5 2024 5:28 PM

Kerala School Gets AI Teacher - Sakshi

ఏఐ టెక్నాలజీ ఉద్యోగులు అవసరం లేకుండా కంపెనీని నిర్వహించే గలిగే సామార్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని చూసే యువతలో భయాలు మొదలయ్యాయి. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు అనేది ప్రశ్నార్థకమో అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంత వరకు సాధ్యమనేది క్లారిటీ లేదు గానీ చాలా రంగాల్లోకి ఈ ఏఐ టెక్నాలజీనే తీసుకొచ్చేలా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడూ టీచర్‌ అవసరం లేకుండానే క్లాస్‌లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్. ఎలా పాఠాలు చెప్పిందంటే..

కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్‌ని ప్రవేశ పెట్టింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్‌ల్యాబ్స్. అక్కడ ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు చకచక​ పాఠాలు బోధించటం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది. ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్‌ . ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. దీని నాలెడ్జ్‌ బేస్‌లో ఇతర ఆటోమేటెడ్‌ టీచింగ్‌ టూల్స్‌ కంటే మెరుగైన అడ్వాన్స్‌ టెక్నాలజీ ఉంది.

ఇది చాట్‌ జీపీటీ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా కూడా పనిచేయగలదు. ఈ ఐరిస్‌ పంతులమ్మ అచ్చం స్త్రీ స్వరంలోనే మాట్లాడుతుంది. ఒక టీచర్‌ ఎలా పాఠాలు చెబుతుందో అలా అర్థవంతంగా చెప్పగలదు. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు ఎలా విడమరిచి వివరించి చెబుతాడో అలానే అన్నింటికి సమాధానాలు ఇచ్చింది ఏఐ ఐరిస్‌. ఈ మేరకు మేకర్స్‌ ల్యాబ్‌ సీఈవో హరిసాగర్‌ మాట్లాడుతూ.."విద్యార్థులు తమ ల్యాబ్‌ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు. రోబిటిక్స్‌ వంటి రంగాల్లో అనుభవాన్ని పొందారు కూడా. అలాగే విద్యార్థుల నుంచి ఈ ఏఐ టీచరమ్మ పట్ల సానుకూల స్పందన వచ్చింది. ఎక్కువ మంది క్లాస్‌ రూంలో ఈ ఏఐ టీచర్‌ ఉండే బాగుంటుంది అని తమ అభిప్రాయన్ని వెలిబుచ్చడం విశేషం". అని అన్నారు. 

(చదవండి: జస్ట్‌ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement