టాలీవుడ్‌లో గురుశిష్యులు.. వీరిబంధం చాలా ప్రత్యేకం! | Tollywood Special Story On Teachers Day | Sakshi
Sakshi News home page

Teachers Day Special: టాలీవుడ్‌లో గురుశిష్యులు.. వీరిబంధం చాలా ప్రత్యేకం!

Published Thu, Sep 5 2024 9:23 AM | Last Updated on Thu, Sep 5 2024 10:22 AM

Tollywood Special Story On Teachers Day

శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్‌ఫుల్‌ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు..  నేడు  గురువుల దినోత్సవం సందర్భంగా అలా సక్సెస్‌ సాధించిన కొందరిని గుర్తు చేసుకుందాం.

సుకుమార్‌ మార్క్‌

తన దర్శకత్వంతో పాటు రైటింగ్స్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్​ వేశారు దర్శకుడు సుకుమార్​. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్​ పట్టిన ఈ స్టార్​ డైరెక్టర్​.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్​ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్​.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్​లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్‌కు నేషనల్‌ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. సుకుమార్‌ లాగే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. తొలి సినిమాలతోనే సూపర్ హిట్స్‌ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు.

తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్‌లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్​ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్​ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్​ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు.

► 'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన బుచ్చిబాబు సన.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్ ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్​లో డైరెక్టర్​గా లాంఛ్​ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్​తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

► టాలీవుడ్‌లో మరో సెన్సేషన్ డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్​గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్​ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో  శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్​గా మారిపోయాడు.

► 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు.
► జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు

► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే.
► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్​గా పనిచేశాడు. 
► 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్​లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
► ఇండస్ట్రీలో స్టార్ రైటర్​గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్‌కు సపోర్ట్‌గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్‌గా పనిచేశారు.

చిరంజీవి- విశ్వనాథ్‌ల బంధం

తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే.  విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్‌లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్‌గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు.

mega


ఆర్జీవీకి ఆయనే ప్రత్యేకం..

ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్‌లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. వ‌ర్మ శిష్యుల్లో ఆయ‌న త‌ర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్ల‌లో కృష్ణ‌వంశీ, తేజ‌, పూరి జ‌గ‌న్నాథ్, గుణ‌శేఖ‌ర్, శివ‌నాగేశ్వ‌ర‌రావు, నివాస్, అజ‌య్ భూప‌తి, జీవ‌న్ రెడ్డి, హరీశ్‌ శంకర్‌, జేడీ చక్రవర్తి, బాలీవుడ్‌ నుంచి అనురాగ్‌ కశ్యప్‌, బాలీవుడ్‌ అగ్రదర్శకుడు మధుర్‌ బండార్కర్‌ ఉన్నారు.  వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జీవీకి చాలా మంది శిష్యులున్నప్పటికీ.. వారిలో ప్రియశిష్యుడు మాత్రం పూరి జగన్నాధ్ మాత్రమే.

puri

సంగీతంలో మణిశర్మ..

సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో  దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్‌ రెహమాన్‌, మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్‌, తమన్‌, హారీశ్‌జైరాజ్‌ కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు.

దాసరి నారాయణరావు- మోహన్‌ బాబు

టాలీవుడ్‌లో దాసరినారాయణరావు- మోహన్ బాబుల అనుబంధం మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి కొన్ని సినిమాలలో నటించారు. మోహన్ బాబు ఎప్పుడూ తన గురువును గుర్తు చేసుకుంటారు. వీరిద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గురు, శిష్యులుగా పేరుపొందారు.

da


రాఘవేంద్రరావు- రాజమౌళి

తెలుగు సినిమాలో  ప్రతి విషయాన్ని వీరిద్దరూ చేసుకుంటుంటారు. రాజమౌళి  గొప్ప డైరెక్టర్ అయినా కూడా.. తన స్క్రిప్టును మొదట రాఘవేంద్రరావుకు వినిపించాల్సిందేనట. టాలీవుడ్‌ మరో క్రేజీ గురుశిష్యుల బంధం రాఘవేంద్రరావు- రాజమౌళిదే.

ra

త్రివిక్రమ్- పోసాని కృష్ణమురళి

గురు, శిష్యుల బంధానికొస్తే తెలుగులో త్రివిక్రమ్- పోసానిది విడదీయరానిబంధం. అందుకే తన గురువైన పోసానికి త్రివిక్రమ్ సినిమాల్లో ప్రత్యేకమైన రోల్స్‌ ఇస్తున్నారు. అంతకుముందు  పోసాని దగ్గర చాలా ఏళ్ల పాటు త్రివిక్రమ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అందుకే త్రివిక్రమ్‌ దర్శకుడిగా మారిన తర్వాత ప్రతీ సినిమాలోనూ తన గురువైన పోసానికి పాత్ర ఇస్తాడు.

ps
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement